వినూత్న ఆలోచనకు శ్రీకారం.. వ్యవసాయ కూలీలకు పండగే!

by Jakkula Mamatha |   ( Updated:21 Jan 2025 9:52 AM  )
వినూత్న ఆలోచనకు శ్రీకారం.. వ్యవసాయ కూలీలకు పండగే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి(State Development) పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవసాయ కూలీలకు శుభవార్త చెప్పింది. అసలు విషయంలోకి వెళితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం ప్రధాన వృత్తి. అధిక శాతం ప్రజలు వ్యవసాయ రంగం(Agriculture sector) పై ఆధారపడతారు. అయితే వ్యవసాయ కూలీలకు అండగా ఏపీ ప్రభుత్వం(AP Government) వినూత్న ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా కూలీలు పొలం పనులకు వెళ్లి వచ్చేందుకు ఆటోలు, ట్రాక్టర్‌ ఇతర వాహనాలను వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో వాహనాల్లో పరిమితికి మించి కూలీలను తీసుకెళ్తుంటారు.

ఈ విధంగా పనులకు వెళుతున్న సందర్భంలో అక్కడక్కడ ప్రమాదాల బారిన పడటం కూడా జరుగుతుంది. ఈ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతుండగా.. మరి కొందరు గాయాలతో బయటపడ్డ ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇటువంటి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రకాశం జిల్లా(Prakasam District) ఎస్పీ ఏ ఆర్ దామోదర్ వినూత్న ఆలోచన చేశారు. వ్యవసాయ కూలీల భద్రత దృష్ట్యా పనులకు వెళ్లే సమయంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని RTC అధికారులకు సూచించారు. ఆయన సూచన పై ఆర్టీసీ(RTC) అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో మార్కాపురం(markapuram)లో మొదటిసారి వ్యవసాయ కూలీలు పొలాల వద్దకు వెళ్లేందుకు బస్సు సర్వీసును ఇవాళ ప్రారంభించారు. డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో కూలీలను మార్కాపురం లోని పలు ప్రాంతాల నుంచి పెద్దారవీడు, తర్లుపాడు, కంభం, డోర్నాల, అర్ధవీడు, బెస్తవారిపేట, కొనకనమిట్ల మండలాలకు పంపించారు.

Next Story

Most Viewed