Skill Case: అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

by srinivas |   ( Updated:2024-03-20 14:41:05.0  )
Skill Case: అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆయనను సీఐడీ నిందతుడిగా చేర్చింది. అంతేకాదు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం పథకంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారులు రిమాండ్‌కు పంపారు. 52 రోజుల పాటు జైళ్లో ఉన్న ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలై రాజకీయ జీవితాన్ని యథావిథిగా కొనసాగిస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఈ కేసులో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. నిందితులకు నోటీసులు జారీ చేస్తున్నారు. తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Read More..

ఏపీలో బీజేపీ అభ్యర్థులు వీరే.. ఆ రోజే లిస్టు విడుదల.. ?

Advertisement

Next Story