మచిలీపట్నంలో ఏసీబీ రైడ్స్.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన అధికారి

by Disha Web Desk 16 |
మచిలీపట్నంలో ఏసీబీ రైడ్స్.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన అధికారి
X

దిశ, వెబ్ డెస్క్: లంచాలపై ఏసీబీ ఎంత ఉక్కుపాదం మోపుతున్నా కొందరు అధికారులు మాత్రం మారడం లేదు. అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. డబ్బులు కోసం చేతులు చాచుతున్నారు. ఏదో ఒక చోట డబ్బులు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా మచిలీపట్నంలో ఏసీబీ రైడ్ కలకలం రేగింది. రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సివిల్ సప్లై డీటీ చెన్నూరి శ్రీనివాస్ పట్టుబడ్డారు. రైస్ మిల్లులో పెద్ద ఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెల నెలా మాముళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్లు యజమాని కామిరెడ్డి వినయ్ కుమార్‌ని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ నెలకు సంబంధించి రూ.10 వేలు ఇవ్వాలని ఒత్తిడి పెంచారు.

దీంతో ఏసీబీ అధికారులకు రైస్ మిల్లు యజమాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పక్కా స్కెచ్ వేసి మరీ సదరు అధికారిని అధికారులు పట్టుకున్నారు. మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని పెట్రోలు బంక్ వద్ద రైస్ మిల్లు యజమాని నుంచి సివిల్ సప్లై డీటీ చెన్నూరి శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా రైడ్ చేశారు. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. లంచం బాగోతం బయటపడటంతో సదరు అధికారిపై శాఖా పరమైన చర్యలకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.

Next Story

Most Viewed