పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు ఇల్లు సిద్ధం.. అక్కడే ఉగాది వేడుకలు

by GSrikanth |   ( Updated:2024-04-06 15:25:14.0  )
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు ఇల్లు సిద్ధం.. అక్కడే ఉగాది వేడుకలు
X

దిశ‌, పిఠాపురం: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ఇల్లు సిద్ధం చేసుకుంటున్నారు. తాను ఇక్కడే ఉంటాన‌ని, ఇల్లు కూడా తీసుకుంటానని ఇటీవ‌ల ప్రకటించారు.ఈ నేప‌థ్యంలో కాకినాడ‌-క‌త్తిపూడి మార్గంలో గొల్లప్రోలు మండ‌లం చేబ్రోలు హైవే ప‌క్కన కొత్త ఇంటిని ఆయ‌న అద్దెకు తీసుకున్నట్టుగా ప్రచారం జ‌రుగుతోంది. చేబ్రోలుకు చెందిన ఓదూరి నాగేశ్వర‌రావు అనే రైతుకు చెందిన ఇంటిని తాత్కాలికంగా అద్దెకు తీసుకుంటున్నట్టుగా చెబుతున్నారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదే ఇంటిలో ఈనెల 9వ తేదిన ఉగాది వేడుక‌లు జ‌రుగుతాయ‌ని అంటున్నారు. ఈమేర‌కు జ‌న‌సేన టీమ్ ప్రత్యేకంగా ప‌వ‌న్ కోసం త‌గిన ఏర్పాట్లతో ఇంటిని అలంక‌రిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా సొంతంగా ఓ ఇంటిని నిర్మించేందుకు కూడా సత్యాన్వేష‌ణ జ‌రుగుతోంది. మొత్తంగా చూస్తే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురాన్ని తన సొంత ఊరుగా చేసుకుంటాన‌ని చెప్పిన కొద్ది రోజుల్లోనే యుద్ధ ప్రతిపాదిక‌న ఏర్పాట్లు జ‌రుగుతుండ‌టంతో జ‌న‌సేన కార్యక‌ర్తలు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Read More..

పేరుకే మూడు పార్టీల కూటమి.. జనసేన, బీజేపీలకూ వారే అభ్యర్థులు

Advertisement

Next Story