- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నచ్చని సంబందం చేసుకో అన్నందుకు కన్న తండ్రిని కడతేర్చిన కసాయి కూతురు
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రోజుల్లో మానవ సంబందాలకు విలువ లేకుండా పోతుంది అనడానికి ఈ ఘటన ఓ నిదర్శనం అని చెప్పుకోవచ్చు. నచ్చని పెళ్లి సంబందం చేసుకోమని అడిగినందుకు కన్న తండ్రినే పొట్టన పెట్టుకుంది ఓ మహాతల్లి. దొరస్వామి అనే వ్యక్తి అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జీఆర్టీ స్కూళ్లో టీచర్ గా పని చేస్తున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురికి పెళ్లి చేయాలని నిశ్చయించుకొని ఓ మంచి సంబందం చూశాడు. ఈ విషయమై తన కూతురిని అడగగా తనకు నచ్చలేదని సమాధానం ఇచ్చింది.
దీనిపై చర్చలు జరుగుతున్న తరుణంలో గురువారం రాత్రి సమయంలో దొరస్వామి తాగి వచ్చి సంబందం విషయమై మరోసారి ప్రశ్నించాడు. కూతురు ససేమిరా అనడంతో ఇరువురి మధ్య వాగ్వాధం జరిగింది. దీంతో మద్యం మత్తులో ఉన్న తండ్రిని ఆ కసాయి కూతురు చపాతి కర్రతో కొట్టింది. దీంతో దొరస్వామి స్పృహ తప్పిపడిపోయాడు. అతడు చావలేదని గుర్తించిన కూతురు ఇనుప రాడ్డుతో మరోసారి దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ దొరస్వామి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.