ఏడేళ్ల బాలికపై 70ఏళ్ల వృద్ధుడు దారుణం..చాక్లెట్ ఆశచూపి

by Seetharam |
ఏడేళ్ల బాలికపై 70ఏళ్ల వృద్ధుడు దారుణం..చాక్లెట్ ఆశచూపి
X

దిశ, డైనమిక్ బ్యూరో : సిగరెట్లకు తండ్రి బానిసగా మారాడు. ఇంట్లో సిగరెట్లు అయిపోవడంతో తండ్రి తన ఏడేళ్ల కూతురిని కిరాణా దుకాణాకు పంపించి తెమ్మన్నాడు. డబ్బులు తీసుకుని సిగరెట్లు తీసుకునేందుకు ఏడేళ్ల చిన్నారి కొట్టుకు వెళ్ళింది. మార్గమధ్యలో అదే గ్రామానికి చెందిన 70ఏళ్ల వృద్ధుడు బాలికను దగ్గరకు పిలిచాడు. చాక్లెట్ ఆశచూపి తాకరాని చోట తాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో బాలిక భయంతో ఇంటికి వచ్చేసింది. జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా కలిసి వృద్ధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే రాజానగరం మండలం శానిటోరియం చెంచు కాలనీలో ఓ కుటుంబం నివసిస్తోంది. కుటుంబ యజమానికి సిగరెట్ల కాల్చే అలవాటు ఉంది. అయితే ఇంట్లో సిగరెట్లు లేకపోవడంతో ఇంటికి సమీపంలో కిరాణా షాపుకు వెళ్లి తేవాలని ఏడేళ్ల కూతురిని పంపించాడు. బాలిక వెళ్తుండగా 70ఏళ్ల వృద్ధుడు మార్గమధ్యలో అడ్డుకున్నాడు. బాలికకు చాక్లెట్లు ఆశచూపి ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఒక్కో చాక్లెట్ ఇస్తూ ఒక్కొక్కటిగా బట్టలు తీసివేశాడు. బాలిక మర్మాంగాన్ని తాకుతూ వికృతచేష్టలకు పాల్పడ్డాడు. దీంతో బాలిక భయంతో అక్కడ నుంచి పారిపోయింది. ఇంటికి వచ్చి తనపట్ల వృద్ధుడు ప్రవర్తించిన తీరును.. ఎక్కడెక్కడ తాకాడో అవన్నీ తల్లిదండ్రులకు వివరించింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు బంధువులు కలిసి వృద్ధుడి దగ్గరకు వెళ్లి నిలదీశారు. అనంతరం దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. దీంతో రాజానగరం పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డలపై ఆకృత్యాలకు పాల్పడే కామాంధులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు పసిబిడ్డను సిగరెట్ల కోసం కిరాణా షాపుకు పంపిన తండ్రిపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed