- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్

దిశ డైనమిక్ బ్యూరో: ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. ఈరోజు ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మొదలైంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్ 2025కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణకు ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చ జరుగుతోంది. గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు, నిర్మాణాల క్రమబద్దీకరణపై ప్రతిపాదనపై చర్చించనున్నారు. ఈరోజు సమావేశంలో పలు కీలక అంశాలను ఎజెండాగా చేర్చారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూముల కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా సాంకేతిక విద్య, ఐసెట్, లా సెట్ పరీక్షలు నిర్వహణ ఒక విద్యా మండలి ప్రత్యేక కమిషనర్ రేటుకు అప్పగించే అంశంపై చర్చిస్తున్నారు. ప్రస్తుతం క్యాబినెట్ సమావేశం కొనసాగుతోంది