- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తల్లిదండ్రులు కాదు.. ఎమ్మార్వో అనుమతిస్తేనే పెళ్లి
దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ కమ్ముకొస్తోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక వ్యాప్తి మొదలైందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆషాడం, మూఢం ముగిశాయి. శ్రావణ మాసం చేరిపోయింది. ఈ నెల 29న భారీగా వివాహ ముహూర్తాలు కుదిరాయి. దీంతో భారీ ఎత్తున వివాహాలకు వధూవరులు సిద్ధమవుతున్నారు. ఇంతలో ప్రభుత్వం బాంబులాంటి వార్త వినిపించింది. ఇంతవరకు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, అతితక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకోవాలనే నిబంధన ఉంది.
పెళ్లి చేసుకుంటున్నామని వధూవరుల కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని నిర్వహించుకుంటామంటే మాత్రమే సరిపోదని చెబుతోంది. ఎమ్మార్వోల అనుమతులు ఉంటేనే వివాహాలు నిర్వహించుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో వివాహానికి ఎంత మంది హాజరవుతున్నారు, వారి పూర్తి వివరాలేంటి, వారికి ఇంతకు ముందు కరోనా సోకిందా?.. కంటైన్మెంట్ జోన్ లేదా రెడ్ జోన్‌ల నుంచి ఎంత మంది వస్తున్నారు? వంటి వివరాలన్నీ ఎమ్మార్వోకి సమర్పించిన తరువాతే వివాహాలకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
అంతే కాకుండా పెళ్లి కార్డుతో పాటు వధూవరుల ఆధార్, కరోనా రిపోర్ట్ ఎమ్మార్వోకి సమర్పించాల్సిందేనని చెబుతూ దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని విడుదల చేసింది. దీనిని పూర్తి చేసి, పది రూపాయల స్టాంప్ పేపర్‌పై కరోనా పూచీకత్తు దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.