అండమాన్ నికోబర్‌లో తొలిసారి పూల్ టెస్టులు

by vinod kumar |
అండమాన్ నికోబర్‌లో తొలిసారి పూల్ టెస్టులు
X

న్యూఢిల్లీ: మనదేశంలో మొట్టమొదటిసారిగా అండమాన్ నికోబర్ అడ్మినిస్ట్రేషన్ కరోనా పూల్ టెస్టులు నిర్వహిస్తున్నది. సాధారణంగా టెస్టింగ్ కిట్ల కొరత ఉన్నప్పుడు పూల్ టెస్టు విధానాన్ని అనుసరిస్తుంటారు. ఈ విధానాన్ని కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబర్ దీవుల్లో పది రోజులుగా అనుసరిస్తున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. నాలుగు లక్షల జనాభా ఉన్న ఈ దీవుల్లో ఇప్పటికి సుమారు 620 టెస్టులు జరిగాయి. ఇక్కడ పూలింగ్ శాంపిళ్ల ద్వారా తక్కువ కిట్లతోనే ఎక్కువ మందికి ఈ టెస్టులు జరుపుతున్నట్టు అండమాన్ నికోబర్ ప్రధాన కార్యదర్శి చేతన్ సంఘీ ట్వీట్ చేశారు. కాగా, పూల్ టెస్టుల విధానానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆమోదమున్నట్టు వివరించాయి. దేశవ్యాప్తంగా ఈ టెస్టింగ్ కిట్ల కొరత కనిపిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఈ విధానాన్ని ఫాలో కాబోతున్నట్టు సమాచారం.

పూల్ టెస్టు అంటే ఏమిటి?

ఈ విధానంలో ఒకే పరీక్షలో ఒకరికి మించిన శాంపిళ్లను కలిపి టెస్టు చేస్తారు. సాధారణంగా పూలింగ్ టెస్టుల్లో ఒక టెస్టింగ్ కిట్‌కు ఐదు శాంపిళ్లను వినియోగిస్తుంటారు. అంటే వంద మందిని పరీక్షించేందుకు 25 టెస్టింగ్ కిట్లు సరిపోతాయని ప్రభుత్వవర్గాలు వివరించాయి. ఇలా కలిపి చేసిన టెస్టులో వైరస్ పాజిటివ్‌గా తేలితే.. ఆ శాంపిళ్లన్నంటిని విడివిడిగా టెస్టు చేస్తారు. అలా పాజిటివ్ క్యాండిడేట్‌ను గుర్తిస్తారు. లేదంటే ఆ ఐదుగురు వ్యక్తుల్లో వైరస్ ఉన్నదా? లేదా? అని గుర్తించేందుకు ఒక్క టెస్టింగ్ కిట్ తేల్చేస్తుంది. ప్రతి ఒక్కరినీ సెపరేట్‌గా పరీక్షించే కన్నా ఈ పద్ధతిలో టెస్టులు జరిపితే తక్కువ టెస్టింగ్ కిట్లను సమర్థంగా వినియోగించుకున్నట్టువుతుంది. ప్రస్తుతం టెస్టింగ్ కిట్ల కొరత ఉన్న నేపథ్యంలో పూల్ టెస్టులకు ప్రాధాన్యం పెరిగే అవకాశమున్నది.

Tags.. coronavirus, pool test, positive, andaman nicobar, first

Advertisement

Next Story