మందు తాగుతున్నావని అడిగానా.. నీకెందుకు స్వామీ నా డ్రెసింగ్ గురించి?: అనసూయ

by Shyam |   ( Updated:2021-10-18 22:52:54.0  )
Anasuya142
X

దిశ, సినిమా: జబర్దస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఫైర్ అయింది. ఓ సీనియర్ యాక్టర్ తన డ్రెసింగ్ గురించి చేసిన కామెంట్స్‌పై స్పెషల్ పోస్ట్ పెట్టింది. అనుభవం గల వ్యక్తి ఇలాంటి ఛీప్ కామెంట్స్ చేయడం దౌర్భాగ్యమన్న ఆమె.. ఒకరి డ్రెసింగ్ అనేది పూర్తిగా పర్సనల్ అని, ప్రొఫెషనల్ చాయిస్ కూడా కావచ్చని తెలిపింది. కానీ, సోషల్ మీడియా దీన్ని పూర్తిగా నెగెటివ్‌గా మార్చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకుముందు సోషల్ మీడియా ఎప్పుడైనా ఆ సీనియర్ యాక్టర్ మందు వేయడం, చిరిగిన దుస్తులు ధరించడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం గురించి చర్చించిందా? అని ప్రశ్నించింది. పెళ్లి చేసుకుని పిల్లలున్న స్టార్ హీరోలు హీరోయిన్లతో రొమాన్స్ చేయడం, షర్ట్ విప్పేసి ఎక్స్‌పోజ్ చేయడం గురించి మాట్లాడని వారు.. తనలాంటి పెళ్లై, పిల్లలున్న మహిళలు కెరియర్‌లో సక్సెస్ కావాలని ముందుకెళ్తే మాత్రం విమర్శలకు దిగుతున్నారని కడిగేసింది. వారసత్వ సాంప్రదాయాలను ప్రశ్నిస్తూ జీవితంలో ఎదగాలని కోరుకుంటున్న మహిళల గురించి మాట్లాడటం మానేసి ఎవరి పని వారు చూసుకుంటే బెట్టర్ అని సూచించింది. కాగా ఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు ఇంతకీ ఆ సీనియర్ యాక్టర్ ఎవరని ప్రశ్నిస్తున్నారు.

https://twitter.com/anusuyakhasba/status/1450070501171154946?s=20

టెన్షన్.. టెన్షన్.. హుజురాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు,……..కేసీఆర్ వర్సెస్ ఈటల వార్

భారీగా పోలీస్ బలగాలు మోహరింపు

Advertisement

Next Story