ఆనంద్ మహీంద్రా, శంతను నారాయణ్‌లకు లీడర్‌షిప్ అవార్డులు!

by Harish |
ఆనంద్ మహీంద్రా, శంతను నారాయణ్‌లకు లీడర్‌షిప్ అవార్డులు!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా-భారత్ దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో ఉన్న దార్శనికతను ప్రశంసిస్తూ.. ఇరు దేశాల భాగస్వామ్య వేదిక యూఎస్ఐఎస్‌పీఎఫ్ దేశీయ వ్యాపారవేత్తలైన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, అడోబ్ ఛైర్మన్ శంతను నారాయణ్‌లకు ‘2020-లీడర్‌షిప్’ అవార్డులను అందజేయనుంది. ఆగష్టు 31న యూఎస్ఐఎస్‌పీఎఫ్ మూడవ వార్షిక లీడర్‌షిప్ సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సు సెప్టెంబర్ 3న ముగియనుంది.

‘యూఎస్ ఇండియా వీక్: నేవిగేటింగ్ న్యూ ఛాలెంజెస్’ పేరున జరిగే ఆ కార్యక్రమంలో 21 ఫార్చూన్ 500 కంపెనీల సీఈవోలు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఇరుదేశాల మంత్రులు పాల్గొంటారు. అమెరికా కేంద్రంగా మహీంద్రా గ్రూప్ తమ ఉనికిని విస్తరిస్తోంది. ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యం కోసం ఉత్తమ నాయకత్వ లక్షణాలను వీరిద్దరు ప్రదర్శించారు. 2020 లీడర్‌షిప్ పురస్కారాలను వీరికి అందజేస్తున్నందుకు సంతోషంగా ఉందని యూఎస్ఐఎస్‌పీఎఫ్ బోర్డ్ ఛైర్మన్ జాన్ ఛాంబర్స్ చెప్పారు. డిజిటల్ సాంకేతికతలో శంతను నారాయణ్ ఎంతో కృషి చేశారు. పలు స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ, సామాజిక ద్వైపాక్షిక సంబంధల్లో విలువలను పెంచుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story