కృష్ణానదిలో కొట్టుకొచ్చిన శవం.. హత్యా.. ఆత్మహత్యా?

by Sumithra |
unidentified body, Krishna river
X

దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం మంగళవారం లభ్యమయ్యింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుని మృతదేహం తెల్లచొక్కా, గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. మృతుని వయస్సు దాదాపు 45 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని మఠంపల్లి ఎస్సై రవి తెలిపారు. కృష్ణానది ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉండడం వలన ఈ మృతదేహం ఏ ప్రాంతానికి చెందినదో తెలియడం లేదని వెల్లడించారు. హత్యా.. ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story