- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సంచలనం.. మహిళను గోనె సంచిలో కుక్కి వరిపొలం ఒడ్డున దారుణంగా..

దిశ, ఆర్మూర్: గుర్తు తెలియని మహిళను దుండగులు హత్య చేసి దహనం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటన మాక్లూర్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. మాక్లూర్ మండలం ముల్లంగి (బి)-శాంతినగర్ రోడ్డు పక్కన ఓ వరిపొలం ఒడ్డున దహనమై ఉన్న మహిళ మృతదేహాన్ని బుధవారం తెల్లవారుజామున వాకర్స్ గమనించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిజామాబాద్ నార్త్ సీఐ గురునాథ్, మాక్లూర్ ఎస్సై రాజారెడ్డి, మహిళా ట్రైనీ ఎస్సై గౌతమి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కాళ్లకు ఉన్న మెట్టెల ఆధారంగా దహనమైన వ్యక్తి మహిళ అని తెలుస్తున్నది. మిగతా శరీరమంతా పూర్తిగా 90 శాతం కాలిపోయి ఉండడంతో ఆమె ఎవరు అనేది తెలియరావడంలేదు. వయసు 25-30 మధ్య ఉంటుందని సీఐ తెలిపారు. ఎవరైనా మహిళ అదృశ్యమై ఉంటే మాక్లూర్ పోలీసులను సంప్రదించాలని కోరారు. దుండగులు మహిళను ఎక్కడో హతమార్చి శవాన్ని గోనెసంచిలో కుక్కి ఏదైనా వాహనంలో ఇక్కడికి తెచ్చి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలోనే పెట్రోలు పోసి తగలబెట్టినట్లు తెలుస్తున్నది. క్లూ టీమ్స్ వారు ఆనవాలు సేకరించారు. మెడికల్ కాలేజీ నాగమోహన్ రావు సమక్షంలో ఫోరెన్సిక్ బృందం వారు ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు.