ఉరేసుకొని వృద్ధుడు ఆత్మహత్య.. కారణం తెలిస్తే కంటనీరు తప్పదు!

by Shyam |
old man suicide
X

దిశ, సదాశివనగర్: కంటిచూపు రాదని ఓ వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మోడెగాం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోడెగాం గ్రామానికి చెందిన రాజిరెడ్డి(59) పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టాడు. ఎన్నోసార్లు ఆసుపత్రిలో చూపించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో సోమవారం తీవ్ర మనస్థాపానికి గురైన రాజిరెడ్డి భార్య అన్సవ్వ వడ్ల కల్లాలకు వెళ్లడాన్ని గమనించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా, రాజిరెడ్డి ఎడమ కాలు, ఎడమ కన్ను పుట్టుకతోనే అంగ వైకల్యం ఉంది. ఈ మధ్య కుడి కన్ను కూడా సరిగా కనబడకపోవడంతో ఆసుపత్రిలో చూపించుకున్నాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఎక్కడ చూపించిన కంటిచూపు రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన రాజిరెడ్డి మృతిచెందాడు. రాజిరెడ్డికి ఒక కుమారుడు, ఇద్దరు కుతుళ్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ శేఖర్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story