పూలను పూజించే గొప్ప సంస్కృతి మనది..

దిశ, సిద్దిపేట: తెలంగాణ సాహిత్య కళాపీఠం ,సిద్దిపేట వారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర పండగ బతుకమ్మ విశిష్టతపై రెండురోజులు శని,ఆదివారాల్లో జరిగిన అంతర్జాల సమ్మేళనం ఎంతో రసవత్తరంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మపై కవిత్వం,బతుకమ్మ పాట,జానపదం అంశాలపై నిర్వహించిన బతుకమ్మ వేడుకలు – 2020 అంతర్జాల/జూమ్ సమ్మేళనంలో తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఒక్కో ప్రాంతానికి ఒక్కో పండగ ఉన్నట్లు, మన రాష్ట్రానికి బతుకమ్మ పండుగ ప్రత్యేకమైనదని అన్నారు. శుభప్రదం […]

Update: 2020-10-12 12:06 GMT

దిశ, సిద్దిపేట: తెలంగాణ సాహిత్య కళాపీఠం ,సిద్దిపేట వారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర పండగ బతుకమ్మ విశిష్టతపై రెండురోజులు శని,ఆదివారాల్లో జరిగిన అంతర్జాల సమ్మేళనం ఎంతో రసవత్తరంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మపై కవిత్వం,బతుకమ్మ పాట,జానపదం అంశాలపై నిర్వహించిన బతుకమ్మ వేడుకలు – 2020 అంతర్జాల/జూమ్ సమ్మేళనంలో తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఒక్కో ప్రాంతానికి ఒక్కో పండగ ఉన్నట్లు, మన రాష్ట్రానికి బతుకమ్మ పండుగ ప్రత్యేకమైనదని అన్నారు. శుభప్రదం జరగాలని కోరుకుంటూ మహిళలు పాడుకునే పాటలే బతుకమ్మ పాటలని అన్నారు. జానపద అకాడమీ పూర్వ అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరికృష్ణ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే పూలతో పూజలు చేస్తే పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదని తెలిపారు.

Tags:    

Similar News