వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల్లో ‘జూమ్ డిస్మోర్ఫియా’

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి దాదాపు చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోం’ సదుపాయాన్ని కల్పించాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో ఐటీ కంపెనీలు మినహా మిగతా సంస్థలన్నీ యథావిధిగా తమ ఆఫీసులను కొనసాగిస్తున్నాయి. కానీ, ఐటీ సంస్థలు మాత్రం తమ ఉద్యోగుల నుంచి బెస్ట్ ఔట్‌పుట్ వస్తుండటంతోపాటు, ఆఫీస్ ఖర్చులు కూడా బాగా ఆదా అవుతుండటంతో మార్చి వరకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ‌ను కొనసాగించనున్నాయి. ఇప్పటికే పనివేళలు పెరిగిపోవడం, సమయం […]

Update: 2020-11-18 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి దాదాపు చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోం’ సదుపాయాన్ని కల్పించాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో ఐటీ కంపెనీలు మినహా మిగతా సంస్థలన్నీ యథావిధిగా తమ ఆఫీసులను కొనసాగిస్తున్నాయి. కానీ, ఐటీ సంస్థలు మాత్రం తమ ఉద్యోగుల నుంచి బెస్ట్ ఔట్‌పుట్ వస్తుండటంతోపాటు, ఆఫీస్ ఖర్చులు కూడా బాగా ఆదా అవుతుండటంతో మార్చి వరకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ‌ను కొనసాగించనున్నాయి. ఇప్పటికే పనివేళలు పెరిగిపోవడం, సమయం సందర్భాలు లేకుండా ఆఫీస్ కాల్స్ రావడంతో ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగిందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఇప్పుడు వారికి మరో సమస్య వచ్చి పడింది. అదే ‘జూమ్ డిస్మోర్ఫియా’.

వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న ఉద్యోగులు, తమ పనిలో భాగంగా రెగ్యులర్‌గా మీటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. బాస్‌లు, క్లయింట్లతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. తరుచుగా వీడియో కాల్స్ మాట్లాడుతుండటంతోపాటు, ఎక్కువ సమయం వర్చువల్ ప్లాట్‌ఫామ్స్‌లో గడపటంతో సెల్ఫ్ ఇమేజ్‌పై దాని ప్రభావం పడుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో ‘జూమ్‌ డిస్మోర్ఫియా’ పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డిస్మోర్ఫియా వల్ల ఉద్యోగులు ఏకాగ్రత కోల్పోతున్నారని ఓ ఆధ్యయనంలో తేలింది.

వీడియో కాల్స్‌లో తమను తాము చూసుకుంటున్న ఉద్యోగులు, తమ శరీరంలో, ముఖంలో వచ్చిన మార్పులను గమనిస్తున్నారు. దీంతో వారి ముఖంలో ముడతలు, యాక్నే సమస్యలు గుర్తించి బాధపడుతున్నారు. జుట్టు ఊడిపోతుండటం కూడా వారిని ఎక్కువగా బాధిస్తోంది. ఆయా లోపాల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు ఆందోళన చెంది, ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ వ్యాధి బారిన పడుతున్నవారిని ‘డిస్మోర్ఫియా’ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లోపాలను సరిదిద్దుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నట్లు తేలింది. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న ఉద్యోగులపై అమెరికాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఇంతకుముందు తమ రూపు గురించి అంతగా ఆలోచించని ఉద్యోగులు కూడా వీడియో కాల్స్‌లో తమ లోపాలు చూసి విచారం వ్యక్తం చేస్తున్నారట. చాలామంది తమ ఫొటోలకు ఫిల్టర్ వాడుతుండటంతో తాము బాగానే ఉన్నట్లు అనుకునేవారు. కానీ, వీడియోలో ఉన్నది ఉన్నట్లు చూపించడంతో ఒక్కసారిగా ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. అందుకే తమ లోపాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆ అధ్యయనంలో తేలింది. ముడతలు తొలగించుకోవడం, యాక్నే సమస్యలు పరిష్కరించుకోవడం, హెయిర్ ప్లాంటేషన్ చేసుకోవడం కోసం వైద్యుల్ని, ప్లాస్టిక్ సర్జరీ నిపుణుల్ని సంప్రదిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గూగుల్‌సెర్చ్‌లో ఎక్కువగా ‘అక్నే’, ‘హెయిర్‌లాస్‌’ వంటి అందానికి సంబంధించిన పదాలను ఎక్కువగా సెర్చ్‌ చేయడమే ‘జూమ్‌ డిస్మోర్ఫియా’ పెరుగుతోందనడానికి ఉదాహరణగా నిలుస్తోందంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News