రాష్ట్రంలో ఉద్యోగుల విభజన షురూ..

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగుల జోనల్​ విభజనలో భాగంగా మండలి ఎన్నికల కోడ్​ లేని నాలుగు జిల్లాల్లో ఆఫ్షన్ల ప్రక్రియ పూర్తి అయింది. నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ జిల్లాల్లో జిల్లాస్థాయి ఉద్యోగుల నుంచి ఆఫ్షన్లు తీసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల కోడ్​ ఉన్న జిల్లాల్లో ఈ నెల 15 తర్వాత ఆఫ్షన్లు తీసుకోనున్నారు. మరోవైపు దీనికి అనుబంధంగా జోనల్​పై కూడా కసరత్తు మొదలైంది. జోనల్​స్థాయిలో కూడా ఆఫ్షన్లు తీసుకుంటామని […]

Update: 2021-12-09 11:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగుల జోనల్​ విభజనలో భాగంగా మండలి ఎన్నికల కోడ్​ లేని నాలుగు జిల్లాల్లో ఆఫ్షన్ల ప్రక్రియ పూర్తి అయింది. నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ జిల్లాల్లో జిల్లాస్థాయి ఉద్యోగుల నుంచి ఆఫ్షన్లు తీసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల కోడ్​ ఉన్న జిల్లాల్లో ఈ నెల 15 తర్వాత ఆఫ్షన్లు తీసుకోనున్నారు. మరోవైపు దీనికి అనుబంధంగా జోనల్​పై కూడా కసరత్తు మొదలైంది. జోనల్​స్థాయిలో కూడా ఆఫ్షన్లు తీసుకుంటామని అధికారులు చెప్పుతున్నారు.

ఈ ప్రక్రియను రాష్ట్రస్థాయిలో మానిటరింగ్​ చేసేందుకు ముగ్గురు ఐఏఎస్​లకు బాధ్యతలు అప్పగించారు. సీనియర్​ ఐఏఎస్​ రాహుల్​ బొజ్జా, అబ్కారీ శాఖ కమిషనర్​ సర్ఫరాజ్​ అహ్మద్​, ఫైనాన్స్​ సెక్రెటరీ రోనాల్డ్​ రోస్​లకు బాధ్యతలను ఇచ్చారు. రోజువారీగా ఆఫ్షన్ల ప్రక్రియ, కలెక్టర్లు తీసుకుంటున్న చర్యలు, సీనియార్టీ జాబితా వంటి అంశాలన్నీ ఈ అధికారులు మానిటరింగ్​ చేయనున్నారు.

సీనియార్టీ జాబితాపై ఉద్యోగుల ఆగ్రహం

మరోవైపు నాలుగు జిల్లాల్లో ఆఫ్షన్ల ప్రక్రియ మొదలైనా, కొన్నిచోట్ల ఉద్యోగులు సీనియార్టీ జాబితాపై ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికతను పరిగణించకుండా.. కేవలం సీనియార్టీతో కేటాయింపులు చేస్తే స్థానికులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. దీనిపై ఆయా శాఖల ఉన్నతాధికారులను ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. దీనిపై ఎలాంటి అన్యాయం జరుగదంటూ ఉద్యోగులకు హామీ ఇస్తున్నారు.

ప్రస్తుతం ఆఫ్షన్లను స్వీకరించిన జిల్లా కలెక్టర్లు.. వాటిని నోడల్​ జిల్లాకు పంపించారు. ఇక్కడి నుంచి కలెక్టర్లు, ఆయా శాఖల ఉన్నతాధికారుల పరిశీలనలో బదిలీలు చేయనున్నారు. ఈ నెల 15 వరకు సీనియార్టీ ప్రకారం బదిలీలు చేసి, అలాట్​మెంట్​ ఆర్డర్లు జారీ చేయనున్నారు.

Tags:    

Similar News