జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆదాయంలో క్షీణత
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏకీకృత ప్రాతిపదికన రూ. 93.41 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 412.09 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 1,760.61 కోట్లకు తగ్గింది. ఏడాది క్రితం కంపెనీ ఆదాయం రూ. 2,190.13 కోట్లతో పోలిస్తే 19.6 శాతం తగ్గింది. పలు వ్యయ నియంత్రణ చర్యలు, ఇతర ఆస్తుల అమ్మకాలతో సహా […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏకీకృత ప్రాతిపదికన రూ. 93.41 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 412.09 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 1,760.61 కోట్లకు తగ్గింది. ఏడాది క్రితం కంపెనీ ఆదాయం రూ. 2,190.13 కోట్లతో పోలిస్తే 19.6 శాతం తగ్గింది. పలు వ్యయ నియంత్రణ చర్యలు, ఇతర ఆస్తుల అమ్మకాలతో సహా ద్రవ్యతను పెంచడం వంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో కంపెనీ ఆదాయం క్షీణించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఈ త్రైమాసికంలో కంపెనీ ప్రకటనల ఆదాయం 26.3 శాతం తగ్గినట్టు కంపెనీ వెల్లడించింది. తొలి త్రైమాసికంలో 66 శాతం క్షీణతతో పోలిస్తే ఈ త్రైమాసికంలో కంపెనీ ప్రకటనల ఆదాయ క్షీణత కొంత సానుకూలమని, వినియోగదారుల విభాగంలో డిమాండ్ పుంజుకుంటున్న సంకేతాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో సగంలో ప్రకటనల ఆదాయం మెరుగ్గా ఉంటుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సోమవారం కంపెనీ షేర్లు 2.40 శాతం క్షీణించి రూ. 183.35 వద్ద ట్రేడయింది.