ఆర్సీబీ కెప్టెన్‌గా యుజ్వేంద్ర చాహల్‌కు చాన్స్ ఇవ్వండి: కోచ్ రణధీర్
దిశ, వెబ్‌డెస్క్: విరాట్ కోహ్లీ భారత T20 కెప్టె్న్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో పాటుగా UAEలో IPL 2021 ముగిసిన తర్వాత RCB కెప్టెన్‌గా కొనసాగకూడదని విరాట్ కోహ్లీ అక్టోబర్‌లో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కేవలం ఆటగాడిగానే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఇప్పుడు RCB యాజమాన్యం కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో పడింది. అయితే RCB స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ పై అతని కోచ్ రణధీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. RCB తదుపరి […]
దిశ, వెబ్‌డెస్క్: విరాట్ కోహ్లీ భారత T20 కెప్టె్న్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో పాటుగా UAEలో IPL 2021 ముగిసిన తర్వాత RCB కెప్టెన్‌గా కొనసాగకూడదని విరాట్ కోహ్లీ అక్టోబర్‌లో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కేవలం ఆటగాడిగానే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఇప్పుడు RCB యాజమాన్యం కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో పడింది. అయితే RCB స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ పై అతని కోచ్ రణధీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. RCB తదుపరి కెప్టెన్‌గా చాహల్ ఎందుకు కాకూడదు అని అన్నాడు. చాహల్ చాలా తెలివైన బౌలర్, జట్టులో అతని సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటే, అతను కెప్టెన్‌గా మంచి ఎంపిక కావచ్చు అని అభిప్రాయపడ్డాడు. అలాగే, చాహల్‌కు ఆర్సీబీ జట్టులోని అందరు ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉంది. ఆధునిక క్రికెట్‌లో జట్టును నడిపించేందుకు బౌలర్లకు కూడా అవకాశం ఇవ్వాలని రణధీర్ అభిప్రాయపడ్డాడు. నవంబర్ 17 నుండి జైపూర్‌లో ప్రారంభం కానున్న ఇండియా vs న్యూజిలాండ్ T20I సిరీస్ కోసం చాహల్ ఎంపికైన సంగతి తెలిసిందే.