ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రకటనపై సుప్రీంకు యువసేన
న్యూఢిల్లీ: ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించాలన్న యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన యువజన విభాగం యువసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనాతో సతమతమవుతున్న సందర్భంలోనూ ఫైనల్ ఇయర్ పరీక్షలను యూనివర్సిటీలు సెప్టెంబర్‌లో నిర్వహించాలని యూజీసీ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(ఎంహెచ్‌ఆర్డీ) శాఖలు నిర్ణయించాయని, అవి సొంత మార్గదర్శకాలపైనే దృష్టి పెట్టాయి గానీ, విద్యార్థుల భౌతిక, మానసిక ఆరోగ్యం, ఆందోళన, అభద్రతలను పట్టించుకోలేదని రిట్ ఫైల్ చేసింది. మహారాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్, యువసేన చీఫ్ ఆదిత్యా […]
న్యూఢిల్లీ: ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించాలన్న యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన యువజన విభాగం యువసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనాతో సతమతమవుతున్న సందర్భంలోనూ ఫైనల్ ఇయర్ పరీక్షలను యూనివర్సిటీలు సెప్టెంబర్‌లో నిర్వహించాలని యూజీసీ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(ఎంహెచ్‌ఆర్డీ) శాఖలు నిర్ణయించాయని, అవి సొంత మార్గదర్శకాలపైనే దృష్టి పెట్టాయి గానీ, విద్యార్థుల భౌతిక, మానసిక ఆరోగ్యం, ఆందోళన, అభద్రతలను పట్టించుకోలేదని రిట్ ఫైల్ చేసింది. మహారాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్, యువసేన చీఫ్ ఆదిత్యా ఠాక్రే నేతృత్వంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్షలు రద్దు చేయాలని యూజీసీ, ఎంహెచ్‌ఆర్డీలకు మే 9వ, జులై 7వ తేదీల్లో యువసేన లేఖలు రాసింది. ఈసారి పరీక్షలకు బదులు వారి సగటు మార్కుల ప్రాతిపదికన ప్రమోట్ చేయాలని సూచించింది.