బీఎస్ఎన్ఎల్‌తో యప్‌టీవీ కీలక భాగస్వామ్యం

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్‌తో ప్రముఖ వీడీయో స్ట్రీమింగ్ వేదిక యప్‌టీవీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో కొత్త సేవలను యూజర్లకు అందించేందుకు, బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ చందాదారులకు యప్‌టీవీ ఓటీటీ సేవలను మరింత విస్తరించడానికి ‘యప్‌టీవీ స్కోప్ ప్లాట్‌ఫామ్’ను కంపెనీ విడుదల చేసింది. దీని ద్వారా వినియోగదారులకు అన్ని ప్రీమియం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను ఒకే ప్యాకేజీ కింద అందించనున్నారు. జీ5, సోనీలివ్, వూట్ సెలెక్ట్ అండ్ లైవ్ టీవీ వంటి ప్రీమియం […]

Update: 2021-02-04 06:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్‌తో ప్రముఖ వీడీయో స్ట్రీమింగ్ వేదిక యప్‌టీవీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో కొత్త సేవలను యూజర్లకు అందించేందుకు, బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ చందాదారులకు యప్‌టీవీ ఓటీటీ సేవలను మరింత విస్తరించడానికి ‘యప్‌టీవీ స్కోప్ ప్లాట్‌ఫామ్’ను కంపెనీ విడుదల చేసింది. దీని ద్వారా వినియోగదారులకు అన్ని ప్రీమియం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను ఒకే ప్యాకేజీ కింద అందించనున్నారు. జీ5, సోనీలివ్, వూట్ సెలెక్ట్ అండ్ లైవ్ టీవీ వంటి ప్రీమియం ఓటీటీ సేవలను ఒకే ప్లాన్ కింద పొందే అవకాశాన్ని కంపెనీ కల్పించింది.

ఐఫోన్, ఆండ్రాయిడ్, అమెజాన్ ఫైర్ టీవీ, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లపై ఇవి అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, మొబైల్ డివైజ్, స్మార్ట్‌టీవీలలో ఓటీటీ సేవలను ఆస్వాదించవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఏఐ, ఎంఎల్ సామర్థ్యంతో యప్‌టీవీ స్కోప్ మెరుగైన అనుభవాన్ని ఇస్తుందని, గతంలో ఎన్నడూ లేని సరికొత్త కంటెంట్‌ను అందిస్తుందని’ యప్‌టీవీ సీఈవో ఉదయ్ రెడ్డి చెప్పారు. ఈ భాగస్వామ్యం ద్వారా చందాదారులకు కొత్త సర్వీసులను అందించడం పట్ల సంతోషంగా ఉందని బీఎస్ఎన్ఎల్ సీఎండీ పి కె పూర్వర్ వెల్లడించారు.

Tags:    

Similar News