ఇక ఏపీలో జలకళ….

దిశ వెబ్ డెస్క్ : ఏపీలో ఈనెల 28న వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నూతన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మంది రైతులకు మేలు చేకూరనున్నట్టు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి తెలిపారు. ఈ పథకం కోసం రూ. 2,340 కోట్లను కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ పథకం కింద ఉచిత బోర్ల ద్వారా 5లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు వెల్లడించారు. ఇక ఈ పథకాన్ని పారదర్శకంగా […]

Update: 2020-09-26 05:54 GMT

దిశ వెబ్ డెస్క్ :
ఏపీలో ఈనెల 28న వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నూతన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మంది రైతులకు మేలు చేకూరనున్నట్టు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి తెలిపారు. ఈ పథకం కోసం రూ. 2,340 కోట్లను కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ పథకం కింద ఉచిత బోర్ల ద్వారా 5లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు వెల్లడించారు.

ఇక ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ తయారు చేయనున్నామని ఆయన అన్నారు. దీంతో దరఖాస్తు నుంచి బోర్ డ్రిల్లింగ్ వరకు ఎప్పటికప్పుడు రైతు సమాచారాన్ని సేకరిస్తామని వివరించారు.

Tags:    

Similar News