వారికి కేసీఆర్ దారి చూపించాలి: వైఎస్ షర్మిల

దిశ, చండూరు: పుల్లెంల గ్రామంలో మంగళవారం వైఎస్‌ఆర్ టీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్ష విజయవంతం అయింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఏడేళ్లలో నిరుద్యోగం నాలుగు రెట్లు పెరిగిందన్నారు. భారతదేశంలో ఎక్కువగా నిరుద్యోగం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని వీళ్ళు పాలకులే కాదు, అసలు మనుషులే కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 54 […]

Update: 2021-07-27 10:37 GMT

దిశ, చండూరు: పుల్లెంల గ్రామంలో మంగళవారం వైఎస్‌ఆర్ టీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్ష విజయవంతం అయింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఏడేళ్లలో నిరుద్యోగం నాలుగు రెట్లు పెరిగిందన్నారు. భారతదేశంలో ఎక్కువగా నిరుద్యోగం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని వీళ్ళు పాలకులే కాదు, అసలు మనుషులే కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 54 లక్షల మంది నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం దారి చూపించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల గురించి అడిగితే వ్యక్తిగత దాడులకు టీఆర్ఎస్ నాయకులు దిగుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలే అని.. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగాలంటే వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News