వైఎస్ షర్మిల కొత్త పార్టీ : 100 నియోజకవర్గాల్లో 16నెలల పాదయాత్ర?
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల త్వరలో తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ అభిమానులు, పలువురు నేతలతో పార్టీ స్థాపన, విధి విధానాలు, భవిష్యత్ కార్యణపై చర్చించేందుకు షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్’లు లోటస్ పాండ్‌కు చేరుకున్నారు. ఇవాళ తొలిసారి నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో భేటీ కానున్నారు. రోజు విడిచి రోజు తెలంగాణకు చెందిన నేతలు, వైఎస్ అభిమానులతో […]
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల త్వరలో తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ అభిమానులు, పలువురు నేతలతో పార్టీ స్థాపన, విధి విధానాలు, భవిష్యత్ కార్యణపై చర్చించేందుకు షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్’లు లోటస్ పాండ్‌కు చేరుకున్నారు. ఇవాళ తొలిసారి నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో భేటీ కానున్నారు. రోజు విడిచి రోజు తెలంగాణకు చెందిన నేతలు, వైఎస్ అభిమానులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి ఆంధ్రాముద్ర ఉన్నందునే కొత్త పార్టీ పేరుతో తెలంగాణలో పాగా వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
రానున్న 30రోజుల్లో పార్టీ స్థాపనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారట. తర్వాత పార్టీ ప్రకటన. ఇందుకోసం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. వైఎస్ఆర్, తెలంగాణ కలిసి వచ్చేలా పార్టీ పేరును ఖరారు చేయనున్నారు. అంతేకాదు పార్టీ విధి విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 100 నియోజకవర్గాల్లో 16నెలల పాటు పాదయాత్ర చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.