104ను బంద్ చేయాలని కేసీఆర్ చూస్తున్నారు : షర్మిల ఫైర్

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని వైఎస్సార్ 104 సేవలను ప్రవేశపెడితే, కేసీఆర్ సర్కార్ ఇప్పటి వ‌ర‌కు ప్రారంభించ‌ని పల్లె దవాఖానాల పేరిట 104 సేవలను బంద్ పెట్టాలని చూస్తోందని YSRTP చీఫ్ షర్మిల సెటైర్లు వేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కంటికి కనపడకుండా పోయిందని, బస్తీ దవాఖానాలకు సుస్తీ చేసిందని మండిపడ్డారు. సర్కార్ దవాఖానలో సౌకర్యాలు కరువయ్యాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల్లో హాస్పిటల్స్ ప్రారంభం కాకముందే […]

Update: 2021-12-07 02:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని వైఎస్సార్ 104 సేవలను ప్రవేశపెడితే, కేసీఆర్ సర్కార్ ఇప్పటి వ‌ర‌కు ప్రారంభించ‌ని పల్లె దవాఖానాల పేరిట 104 సేవలను బంద్ పెట్టాలని చూస్తోందని YSRTP చీఫ్ షర్మిల సెటైర్లు వేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కంటికి కనపడకుండా పోయిందని, బస్తీ దవాఖానాలకు సుస్తీ చేసిందని మండిపడ్డారు. సర్కార్ దవాఖానలో సౌకర్యాలు కరువయ్యాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్లెల్లో హాస్పిటల్స్ ప్రారంభం కాకముందే 104 సేవలను బంద్ చేస్తున్నారంటే కేసీఆర్‌కు ప్రజల ప్రాణాలంటే ఎంత అంతులేని ప్రేమనో అర్థమవుతోందని ఎద్దేవ చేశారు. సౌలతులు లేక, వైద్యం అందక సర్కార్ దవాఖానల్లో జనం కరోనాతో చస్తుంటే.. సదుపాయాలు కల్పించలేనప్పుడే ప్రజల ప్రాణాల మీద సీఎంకు ఎంత ప్రేమ ఉందో తెలిసిపోయిందని మండిపడ్డారు.

 

Tags:    

Similar News