YS Sharmila : మందకృష్ణను కలిసిన షర్మిల.. మద్దతు ఇస్తారా.?
దిశ, తెలంగాణ బ్యూరో : MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను YSRTP చీఫ్షర్మిల బుధవారం కలిశారు. ఈ సందర్బంగా నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో ఈనెల 12వ తేదీన నిర్వహించనున్న ‘దళిత భేరి’ సభకు రావాలని మందకృష్ణను షర్మిల ఆహ్వానించారు. అయితే ఇటీవల మందకృష్ణకు శస్త్ర చికిత్స జరగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు షర్మిల బుధవారం విద్యానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో పలు అంశాలపై […]
దిశ, తెలంగాణ బ్యూరో : MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను YSRTP చీఫ్షర్మిల బుధవారం కలిశారు. ఈ సందర్బంగా నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో ఈనెల 12వ తేదీన నిర్వహించనున్న ‘దళిత భేరి’ సభకు రావాలని మందకృష్ణను షర్మిల ఆహ్వానించారు. అయితే ఇటీవల మందకృష్ణకు శస్త్ర చికిత్స జరగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు షర్మిల బుధవారం విద్యానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో పలు అంశాలపై వారు చర్చించారు. దళితుల పక్షాన చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని మందకృష్ణ మాదిగను ఆమె కోరారు. మందకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.