ఫిబ్రవరిలోగా వేదాద్రి పూర్తి చేస్తం: జగన్
దిశ, ఏపీ బ్యూరో: వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని సీఎం వై ఎస్ జగన్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ ను సీఎం తాడేపల్లి నుంచి రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ నందిగామ, వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట మండలాల్లోని 38,627 ఎకరాలకు సాగునీరు, 30 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ఈ ఎత్తిపోతలకు శ్రీకారం […]
దిశ, ఏపీ బ్యూరో: వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని సీఎం వై ఎస్ జగన్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ ను సీఎం తాడేపల్లి నుంచి రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ నందిగామ, వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట మండలాల్లోని 38,627 ఎకరాలకు సాగునీరు, 30 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ఈ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రూ.489 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును చేపట్టామన్నారు. పక్కనే కృష్ణా నది ఉన్నా తాగు, సాగు నీటికి ప్రజలు ఇబ్బందిపడుతుంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన 14 నెలల్లోనే ప్రాజెక్టును చేపట్టినట్లు సీఎం వివరించారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రులు పేర్ని నాని, ఆళ్ల నాని, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం జగన్ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.