ఆ ఎమ్మెల్యే కాంప్లెక్స్‌లో యువకుడిని కొట్టి చంపారు..!

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నూతనంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఓ యువకుడు శుక్రవారం హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ సైదేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరగుతోంది. జీవన్ రెడ్డి సొంత గ్రామం వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన షేక్ షాదుల్లా (29), షేక్ […]

Update: 2021-02-20 09:05 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నూతనంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఓ యువకుడు శుక్రవారం హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ సైదేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరగుతోంది. జీవన్ రెడ్డి సొంత గ్రామం వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన షేక్ షాదుల్లా (29), షేక్ నదీంలు దొంగతనానికి వచ్చారు. అయితే రాత్రి వేళ శబ్దం కావడంతో అక్కడ పనిచేసే కభీర్, సాధక్‌ అన్సారీలకు మెలకువ వచ్చింది. దొంగతనానికి వచ్చిన ఆ ఇరువురిని కభీర్, సాధక్‌లు పట్టుకుని ఇనుప పైపులతో తీవ్రంగా చితక భాదారు. వారి దెబ్బలకు షాదుల్లాకు తల పగలగా… నధీం కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా షాదుల్లా మృతి చెందగా, నదీం పరిస్థితి విషమంగా ఉంది.

షాదుల్లా మృతి చెందిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు స్థానికులు తెలిపారు. దీంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చామని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలు తమకు చెప్పడం లేదని.. ఘటనా స్థలానికి సెక్యూరిటీ సిబ్బంది తమను రానివ్వడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాగా ఘటన జరిగినప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్థానికంగా ఉన్నా.. షాపింగ్ కాంప్లెక్స్ వద్ధకు రాకుండానే హైద్రాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే యువకులు దొంగతనానికి వచ్చారా.. మరేదైనా జరిగి ఉంటుందా అన్న విషయాలు నదీం కోలుకున్న తర్వాత బయటకు వస్తాయి.

Tags:    

Similar News