ASI కాళ్లు, చేతులు కట్టేసి చితకబాదిన యువకులు.. ఎక్కడో తెలుసా (వీడియో)
దిశ, వెబ్డెస్క్ : దీపావళి రోజున పెట్రోలింగ్ ఎందుకు చేస్తున్నావు అని ఏకంగా కొందరు వ్యక్తులు ఏఎస్ఐపై దాడికి దిగారు. పోలీసు.. చేతులను కాళ్లను కట్టేసి.. అందరూ కలిసి అతన్ని చితకబాదారు. ఈ దారుణ ఘటన బీహార్ జిల్లాలోని చంపారన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మోతిహరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరమ్పుర గ్రామంలో ఘర్షణ జరుగుతున్నట్టు దీపావళి రోజున సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏఎస్ఐ సీతారం దాస్ హుటాహుటిని ఘటన స్థలానికి బయలుదేరారు. […]
దిశ, వెబ్డెస్క్ : దీపావళి రోజున పెట్రోలింగ్ ఎందుకు చేస్తున్నావు అని ఏకంగా కొందరు వ్యక్తులు ఏఎస్ఐపై దాడికి దిగారు. పోలీసు.. చేతులను కాళ్లను కట్టేసి.. అందరూ కలిసి అతన్ని చితకబాదారు. ఈ దారుణ ఘటన బీహార్ జిల్లాలోని చంపారన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మోతిహరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరమ్పుర గ్రామంలో ఘర్షణ జరుగుతున్నట్టు దీపావళి రోజున సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది.
దీంతో ఏఎస్ఐ సీతారం దాస్ హుటాహుటిని ఘటన స్థలానికి బయలుదేరారు. తీరా అక్కడికి చేరుకోగానే ఏఎస్ఐని చూసిన యువకులు ఎందుకు వచ్చావ్ అంటూ రెచ్చిపోయారు. పండుగ రోజున పెట్రోలింగ్ ఏంటని దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలోనే ఏఎస్ఐపై దాడికి దిగారు. ఏఎస్ఐ చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి.. అందరూ కలిసి అతన్ని చితకబాదారు. ఆ తర్వాత కాసేపటికి బంధించిన ఏఎస్ఐని యువకులు విడిచిపెట్టారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
https://t.co/2z3rOAhLMz@BJP4Bihar @Dev_Fadnavis @ndtvindia @SMungantiwar @waglenikhil
What nice goverment in Bihar i think @Dev_Fadnavis ji need to talk on this causes once issue belongs to maharashtra then they create big Hungama am i right @waglenikhil ji
— Pravin247 (@Pravin2471) November 7, 2021