MH: అదృష్టం అంటే ఇతనిదే.. అందుకే ప్రతీ ఓటు కీలకమనేది!

మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది.

Update: 2024-11-23 16:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అఘాడీ కూటమికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మొదటి నుంచి బీజేపీ(BJP) కూటమి అభ్యర్థులు ఆధిక్యత సాధించారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని ఓ నియోజకవర్గంలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. మాలేగావ్ సెంట్రల్ నియోజకవర్గం(Malegaon Central Constituency)లో ఎంఐఎం పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్(Mohammed Ismail Abdul) కేవలం 162 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇస్మాయిల్‌కు 1,09,653 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన ఆసిఫ్ షేక్ రషీద్(ఇండియన్ సెక్యులర్ లార్జెస్ట్ అసెంబ్లీ ఆఫ్ మహారాష్ట్ర)కు 1,09,491 ఓట్లు పోలయ్యాయి. ఆ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. మహారాష్ట్రలో ఎంఐఎం 16 సీట్లలో పోటీ చేయగా గెలిచిన ఏకైక సీటు ఇదే కావడం గమనార్హం.

Tags:    

Similar News