యువతి ప్రాణం తీసిన అనుమానం
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి మూలంగా మనుషుల్లో ఉన్న మానవత్వం మంటగలిసిపోతోంది. ఎంత ఆపద వచ్చినా ఎవరినీ కనీసం దగ్గరకు కూడా రాకుండా చేసింది. అంతెందుకు పబ్లిక్ ప్లేసుల్లో ఎవరైనా అనారోగ్యంతో కనిపించి, తుమ్మినా, దగ్గినా అనుమానంగా చూసి, వారికి దూరంగా వెళ్లే పరిస్థితులు తీసుకొచ్చింది. సరిగ్గా ఇలాంటి ఘటనే దేశ రాజధాని డిల్లీలో చోటుచేసుకుంది. తనకు కరోనా లక్షణాలు లేవని చెప్పినా వినకుండా ఓ యువతిని బస్సులో నుంచి బలవంతంగా బయటకు తోసేశారు. రోడ్డుమీద […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి మూలంగా మనుషుల్లో ఉన్న మానవత్వం మంటగలిసిపోతోంది. ఎంత ఆపద వచ్చినా ఎవరినీ కనీసం దగ్గరకు కూడా రాకుండా చేసింది. అంతెందుకు పబ్లిక్ ప్లేసుల్లో ఎవరైనా అనారోగ్యంతో కనిపించి, తుమ్మినా, దగ్గినా అనుమానంగా చూసి, వారికి దూరంగా వెళ్లే పరిస్థితులు తీసుకొచ్చింది. సరిగ్గా ఇలాంటి ఘటనే దేశ రాజధాని డిల్లీలో చోటుచేసుకుంది. తనకు కరోనా లక్షణాలు లేవని చెప్పినా వినకుండా ఓ యువతిని బస్సులో నుంచి బలవంతంగా బయటకు తోసేశారు. రోడ్డుమీద పడ్డ ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఢిల్లీ నుంచి అన్సిక యాదవ్ అనే యువతి తన తల్లితో కలిసి యూపీలోని శికోహాబాద్ వెళ్లేందుకు బస్సు ఎక్కారు. బస్సు ఢిల్లీ నుంచి యమునా ఎక్స్ ప్రెస్ హైవే మీద వెళ్తుండగా యువతితో కరోనా లక్షణాలు ఉన్నాయని కొంతమంది ప్రయాణికులు గుర్తించారు. వెంటనే బస్సు ఆపేయాలని ప్రయాణికులు పట్టుబట్టారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, తానుబాగానే ఉన్నానని చెప్పినా ప్రయాణికులు వినలేదు. బస్సు డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులు ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఒత్తిడితో బస్సు డ్రైవర్ ఆ యువతిని బలవంతంగా బస్సులోంచి తోసేశాడు. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మరణించింది. యువతి మరణానికి సంబంధించిన కేసును పోలీసులు ప్రసుత్తం దర్యాప్తు చేస్తున్నారు.