అక్రమార్కుల ఎత్తుగడ.. శ్మశానంలో మద్యం వ్యాపారం
దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యానికి ఉన్న డిమాండును సొమ్ము చేసుకోవడానికి కొత్త ఎత్తుగడ వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఏకంగా శ్మశాన వాటికలో మద్యం వ్యాపారం మొదలు పెట్టాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం మెదక్ జిల్లా తుప్రాన్ మండలానికి చెందిన రవి బెల్ట్‌షాప్ నిర్వహించేవాడు. లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలు, బెల్ట్‌షాపులు మూతపడ్డాయి. ఒక్కసారిగా మద్యానికి భారీగా డిమాండు పెరగడంతో బ్లాకులో విక్రయాలకు తెరతీశాడు. ఇంటిలో పెట్టుకుని విక్రయిస్తే పోలీసులకు దొరికిపోతామని […]
దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యానికి ఉన్న డిమాండును సొమ్ము చేసుకోవడానికి కొత్త ఎత్తుగడ వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఏకంగా శ్మశాన వాటికలో మద్యం వ్యాపారం మొదలు పెట్టాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం మెదక్ జిల్లా తుప్రాన్ మండలానికి చెందిన రవి బెల్ట్‌షాప్ నిర్వహించేవాడు. లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలు, బెల్ట్‌షాపులు మూతపడ్డాయి. ఒక్కసారిగా మద్యానికి భారీగా డిమాండు పెరగడంతో బ్లాకులో విక్రయాలకు తెరతీశాడు. ఇంటిలో పెట్టుకుని విక్రయిస్తే పోలీసులకు దొరికిపోతామని కొత్త ఎత్తుగడ వేశాడు. శ్మశాన వాటికను మద్యం విక్రయాలకు అడ్డగా మార్చుకున్నాడు. ఎవరైనా మద్యం కావాలని అడిగితే శ్మశాన వాటికకు రమ్మనేవాడు. అధిక ధరలకు మద్యం అమ్మేవాడు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు శ్మశాన వాటికకు చేరుకుకోగా రవి అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడే ఉన్న చిన్న రేకులో షెడ్డులో తనిఖీ చేయగా రూ. లక్ష విలువ చేసే మద్యం బయట పడింది. మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
tag: police arrest, young men, liquor business, Graveyard, medak