వదినను కాల్ గర్ల్‌గా మార్చిన మరిది.. ఎందుకో తెలుసా..?
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వచ్చాక యువత పెడదోవ పడుతుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని మహిళలను లైంగికంగా వేధిస్తూ, తప్పులకు పాల్పడుతున్నారు కొందరు యువకులు. చిన్న చిన్న కారణాలకు పగను పెంచుకొని జైలుపాలవుతున్నారు, తాజాగా ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించామని అడిగినందుకు వదిన ను కాల్ గర్ల్ గా మార్చేసాడు ఒక దుష్టుడు. ఈ దారుణమైన సంఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా, మార్గుల మండలం కలకొండ గ్రామానికి […]
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వచ్చాక యువత పెడదోవ పడుతుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని మహిళలను లైంగికంగా వేధిస్తూ, తప్పులకు పాల్పడుతున్నారు కొందరు యువకులు. చిన్న చిన్న కారణాలకు పగను పెంచుకొని జైలుపాలవుతున్నారు, తాజాగా ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించామని అడిగినందుకు వదిన ను కాల్ గర్ల్ గా మార్చేసాడు ఒక దుష్టుడు. ఈ దారుణమైన సంఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా, మార్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన నాగిళ్ల యశ్వంత్ (19 ) డబ్బు అవసరమై వరుసకు వదిన అయ్యే మహిళ వద్ద రూ. 2 వేలు అప్పు చేశాడు. ఆ అప్పును తిరిగి చెల్లించమని మహిళ అడగడం మొదలు పెట్టేసరికి తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. దీంతో మహిళ, ఆమె భర్త, యశ్వంత్ తల్లిదండ్రులకు విషయం చెప్పారు.
తల్లిదండ్రులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అన్న, వదినపై పగ పెంచుకున్నాడు యశ్వంత్. ఎలాగైనా వీరి పరువు తీయాలనుకున్నాడు. వెంటనే వదిన ఫోన్ నెంబర్ ని షేర్ చాట్ లో కాల్ గర్ల్ గా పేరు మార్చి అప్ లోడ్ చేశాడు. “హయ్.. ఐయామ్ ఆంటీ.. నాకు పెళ్లయి.. ఒక కొడుకు ఉన్నాడు. కానీ .. నా భర్త ఒక వేస్ట్ ఫెల్లో .. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి” అంటూ ఫోన్ నెంబర్ జత చేశాడు. దీంతో పగలు, రాత్రి మహిళకు ఆకతాయిల నుండి ఫోన్లు రావడం ఎక్కువయ్యాయి. ఈ కాల్స్ ని భరించలేని మహిళ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఐపీ అడ్రస్ ద్వారా యశ్వంత్ ని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.