వర్మను కుక్కతో పోల్చిన యంగ్ హీరో
రాం గోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడంటే చాలు.. ఆటోమేటిక్‌గా ఆ సినిమా చుట్టూ వివాదాలు అల్లుకుంటాయి. అసలు వర్మ ఎంచుకునే కథలే.. వివాదాస్పద అంశాలు. ఎప్పటి నుంచో మెగాస్టార్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన వర్మ.. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగాత్మకంగా సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దాంతో అటు పవర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు వర్మపై కోపంతో ఊగిపోతున్నారు. పవర్ స్టార్ అభిమాని అయిన టాలీవుడ్ యంగ్ హీరో […]
రాం గోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడంటే చాలు.. ఆటోమేటిక్‌గా ఆ సినిమా చుట్టూ వివాదాలు అల్లుకుంటాయి. అసలు వర్మ ఎంచుకునే కథలే.. వివాదాస్పద అంశాలు. ఎప్పటి నుంచో మెగాస్టార్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన వర్మ.. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగాత్మకంగా సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దాంతో అటు పవర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు వర్మపై కోపంతో ఊగిపోతున్నారు. పవర్ స్టార్ అభిమాని అయిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. వర్మను డైరెక్ట్ అటాక్ చేశాడు. వర్మను కుక్కతో పోల్చుతూ.. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థమయ్యిందిగా’ అంటూ నిఖిల్ ఆర్జీవీని తిడుతూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ యంగ్ హీరో కౌంటర్‌పై ఆర్జీవీ ఎలా స్పందిస్తాడో చూడాలి. మరోవైపు పవన్ అభిమానులు కూడా ఆర్జీవీని టార్గెట్ చేశారు. కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఆర్జీవీకి వ్యతిరేకంగా ‘పరాన్న జీవి’ అనే సినిమా తీస్తున్నారు. దాంతో వర్మను చాలామంది పరాన్నజీవిగా రామును కౌంటర్ అటాక్ చేశారు. దాంతో వర్మ కూడా దీనిపై స్పందిచాడు. తాను పరాన్నజీవినని, తానే కాదు.. అందరూ పరాన్న జీవులేనని తనదైన శైలిలో జవాబిచ్చారు. ఇక ఆర్జీవీ జీవితంలోని చీకటి కోణాలను తెరముందు చూపించేందుకు ఓ వెబ్ సిరీస్ కూడా మొదలైంది. దాని పేరు వెల్లడించలేదు కానీ, అందులో షకలక శంకర్ లీడ్ రోల్ పోషించాడు. దీనికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదల చేశారు.