ఆ కరెన్సీ చాలా ప్రమాదకరమైనది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టోకరెన్సీ ప్రమాదకరమైన డిజిటల్ కరెన్సీ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో అన్నారు. అంతకుముందు రోజు లోక్‌సభలో దేశంలోని బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన లేదని ఆర్థిక మంత్రి చెప్పిన సంగతి తెలిసిందే. ‘క్రిప్టోకరెన్సీ ప్రమాదకరమైనదిగా భావిస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి నియంత్రణ ఏదీ లేదు. ఈ కరెన్సీ ప్రకటనలపై నిషేధం విధించడంపైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆర్‌బీఐ, సెబీల ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ప్రభుత్వం త్వరలో బిల్లును […]
దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టోకరెన్సీ ప్రమాదకరమైన డిజిటల్ కరెన్సీ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో అన్నారు. అంతకుముందు రోజు లోక్‌సభలో దేశంలోని బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన లేదని ఆర్థిక మంత్రి చెప్పిన సంగతి తెలిసిందే. ‘క్రిప్టోకరెన్సీ ప్రమాదకరమైనదిగా భావిస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి నియంత్రణ ఏదీ లేదు. ఈ కరెన్సీ ప్రకటనలపై నిషేధం విధించడంపైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆర్‌బీఐ, సెబీల ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ప్రభుత్వం త్వరలో బిల్లును ప్రవేశపెడుతుందని’ రాజ్యసభ్యలో వివరించారు.
క్రిప్టోకరెన్సీలు అవాంఛనీయ కార్యకలాపాలకు దారీతీసే ప్రమాదాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రకటనలను అరికట్టేందుకు పెట్టుబడిదారులను హెచ్చరించామన్నారు. అలాగే, ‘సున్నితమైన ఖాతాదారుల’కు రుణాలు ఇవ్వొద్దని బ్యాంకులను కోరుతూ కేంద్రం ఎలాంటి నిర్దిష్ట ఆదేశాలను జారీ చేయలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. నిర్ధిష్ట ఖాతాదారులకు రుణాలివ్వకూడదని బ్యాంకులను ఆదేశించే అధికారిక విధానం ఏదీ లేదని స్పష్టం చేశారు. బ్యాంకులు కేవైసీ, సివిల్ రేటింగ్ లాంటి వాటి ఆధారంగా ఇస్తాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా పోలీసులు, రాజకీయ నాయకులకు రుణాలివ్వడంలో బ్యాంకులకు సమస్యలు ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావ్ అన్నారు. ఈ ఖాతాదారులకు రుణాలిచ్చేముందు బ్యాంకులు ట్రాక్ రికార్డు చూస్తాయని వివరించారు.