నన్ను బద్నామ్ జేస్తుండ్రు: యెండల లక్ష్మినారాయణ
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఈ నెల 26న ఓ న్యూస్ చానల్ లో హుజురాబాద్ ఎన్నికల్ల విషయంలో దళిత కుటుంబాలకు డబ్బులు వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని అన్న విషయాన్ని వక్రీకరిస్తూ దీనిని సోషల్ మీడియాలో దళిత సంఘాలను తప్పుదోవ పట్టించే విధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేశారు అని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ అన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఈ నెల 26న ఓ న్యూస్ చానల్ లో హుజురాబాద్ ఎన్నికల్ల విషయంలో దళిత కుటుంబాలకు డబ్బులు వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని అన్న విషయాన్ని వక్రీకరిస్తూ దీనిని సోషల్ మీడియాలో దళిత సంఘాలను తప్పుదోవ పట్టించే విధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేశారు అని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ అన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, దళిత సంఘాలను తప్పుదోవ పట్టించి బద్నామ్ చేయద్దని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేసారు.
సమాజ హితం కోసం దేశ అభివృద్ధి కోసం పాటు పడే బీజేపీ పార్టీ హుజరాబాద్ లో గెలుస్తుందని అన్నారు. హుజురాబాద్ లో ఎక్కడ ఓడిపోతామోనని భయం అధికార పార్టీ లో ఉందన్నారు. టీవీ చర్చలో నేను ఒకటి మాట్లాడితే మరొకటిగా గాదరి కిషోర్ చిత్రీకరించారు అని ఆరోపించారు. దళితులపై మీకు నిజంగా ప్రేమ ఉంటే దళిత హంతకుడైన జీవన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకి పంపండి అన్నారు. అమాయక దళిత సోదరులను అడ్డుపెట్టుకొని చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ భూషణ్, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి పటేల్ ప్రసాద్, బీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, గంగోని గంగాధర్, సుగుణ, నగర మాజీ అధ్యక్షులు సుధాకర్, పోలీస్ శ్రీను, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.