పది దాటితే కఠిన చర్యలు.. డీఎస్పీ శశాంక్ హెచ్చరిక

దిశ, ఎల్లారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రాత్రి సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను అదుపులోకి తీసుకొని విచారించారు. లాక్‌డౌన్ నిబంధనలు అందరూ పాటించి, కరోనా వైరస్‌ను నిర్మూలించాలన్నారు. అవసరం ఉంటే తప్ప రోడ్లపైకి రావొద్దు అని వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ఆ సమయంలోనే […]

Update: 2021-05-17 10:26 GMT

దిశ, ఎల్లారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రాత్రి సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను అదుపులోకి తీసుకొని విచారించారు. లాక్‌డౌన్ నిబంధనలు అందరూ పాటించి, కరోనా వైరస్‌ను నిర్మూలించాలన్నారు. అవసరం ఉంటే తప్ప రోడ్లపైకి రావొద్దు అని వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ఆ సమయంలోనే ప్రజా రవాణా సేవలు జరుగుతాయన్నారు. సమయం మించిందో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News