జలావాసంలోకి ఎల్లమ్మ ఆలయం
దిశ, మెదక్: కొన్ని దశాబ్దాల నుంచి పూజలందుకున్న ఎల్లమ్మతల్లి జలావాసంలోకి వెళ్లింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామంలో నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎత్తిపోతలు ప్రారంభించడంతో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం ఎల్లమ్మ తల్లి దేవాలయం ముంపునకు గురికానుంది. బుధవారం మధ్యాహ్నం నుంచి మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తుండటంతో గోదావరి జలాలు ఎల్లమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకున్నాయి. దీంతో ఆలయం చుట్టూ నీరు చేరి, పూర్తిగా మునిగిపోయే దశకు చేరుకుంది. దీంతో ఏండ్లుగా పూజలందిస్తూ […]
దిశ, మెదక్: కొన్ని దశాబ్దాల నుంచి పూజలందుకున్న ఎల్లమ్మతల్లి జలావాసంలోకి వెళ్లింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామంలో నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎత్తిపోతలు ప్రారంభించడంతో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం ఎల్లమ్మ తల్లి దేవాలయం ముంపునకు గురికానుంది. బుధవారం మధ్యాహ్నం నుంచి మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తుండటంతో గోదావరి జలాలు ఎల్లమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకున్నాయి. దీంతో ఆలయం చుట్టూ నీరు చేరి, పూర్తిగా మునిగిపోయే దశకు చేరుకుంది. దీంతో ఏండ్లుగా పూజలందిస్తూ వచ్చిన గ్రామస్థులు.. చివరి సారిగా ఆలయాన్ని చూసేందుకు తరలివస్తున్నారు.
Tags: yellamma, temple, medak, ts news