వార్షిక ఋణ ప్రణాళిక విడుదల
దిశ,సిద్దిపేట: సిద్ధిపేట జిల్లాకు సంబంధించి 2020-21 సంవత్సరానికి గాను వార్షిక ఋణ ప్రణాళికను కలెక్టరేట్ లో జిల్లా పాలనాధికారి పి.వెంకట్రామా రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి మాట్లాడుతూ…. 2020-21 సంవత్సరంలో సిద్ధిపేట జిల్లాలో గల బ్యాంకులు 3900 కోట్ల రూపాయలను 2,87,462 మంది లబ్ధిదారులకు రుణాలుగా అందించనున్నాయని తెలిపారు. ఇందులో 2,756 కోట్లు వ్యవసాయ రుణాలుగాను, 586 కోట్లు చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు గాను అందించనున్నట్టు తెలిపారు. 314 […]
దిశ,సిద్దిపేట:
సిద్ధిపేట జిల్లాకు సంబంధించి 2020-21 సంవత్సరానికి గాను వార్షిక ఋణ ప్రణాళికను కలెక్టరేట్ లో జిల్లా పాలనాధికారి పి.వెంకట్రామా రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి మాట్లాడుతూ…. 2020-21 సంవత్సరంలో సిద్ధిపేట జిల్లాలో గల బ్యాంకులు 3900 కోట్ల రూపాయలను 2,87,462 మంది లబ్ధిదారులకు రుణాలుగా అందించనున్నాయని తెలిపారు. ఇందులో 2,756 కోట్లు వ్యవసాయ రుణాలుగాను, 586 కోట్లు చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు గాను అందించనున్నట్టు తెలిపారు. 314 కోట్లను విద్య, ఇంటి రుణాలుగాను,339 కోట్లను మిగతా రంగాలకు బ్యాంకులు అందించనున్నాయని చెప్పారు.