అభిమానులు లేనిది హీరోలు లేరు.. టాలీవుడ్‌కి వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్
దిశ, ఏపీ బ్యూరో: ‘అభిమానులు లేనిదే హీరోలు లేరు. అభిమానులతోనే హీరోలకు ఫుల్ క్రేజ్, రెమ్యునరేషన్ పెరుగుతుంది. ఒక సినిమా హిట్టా.. ఫట్టా అనేది డిసైడ్ చేసేది ప్రేక్షకుడే. అందుకే సినీహీరోలు ప్రేక్షకులను అభిమాన దేవుళ్లు అని కొలుస్తూ ఉంటారు. అలాంటి ప్రేక్షక దేవుళ్లు కష్టాల్లో ఉంటే సినీ పరిశ్రమ ఆదుకునేందుకు ముందుకు వచ్చేది. హీరోలు వాళ్ల స్థాయిను ఆర్థిక సహాయం ప్రకటించేవారు. ఒకానొక దశలో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు అన్న నందమూరి తారకరామారావు, అక్కినేని […]
దిశ, ఏపీ బ్యూరో: ‘అభిమానులు లేనిదే హీరోలు లేరు. అభిమానులతోనే హీరోలకు ఫుల్ క్రేజ్, రెమ్యునరేషన్ పెరుగుతుంది. ఒక సినిమా హిట్టా.. ఫట్టా అనేది డిసైడ్ చేసేది ప్రేక్షకుడే. అందుకే సినీహీరోలు ప్రేక్షకులను అభిమాన దేవుళ్లు అని కొలుస్తూ ఉంటారు. అలాంటి ప్రేక్షక దేవుళ్లు కష్టాల్లో ఉంటే సినీ పరిశ్రమ ఆదుకునేందుకు ముందుకు వచ్చేది. హీరోలు వాళ్ల స్థాయిను ఆర్థిక సహాయం ప్రకటించేవారు. ఒకానొక దశలో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు అన్న నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావులాంటి వారు జోలె పట్టారంటే వారికి అభిమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అదే ఒరవడిని తరువాత తరం హీరోలు సైతం కంటిన్యూ చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు మేము సైతం అంటూ ముందుకు వచ్చేవారు. అయితే ప్రస్తుతం ఏపీలో వరదలు ముంచెత్తాయి. వరదలతో రాష్ట్రం అల్లాడుతుంది. వరదల ధాటికి రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు కూడా కకావికలమైంది. సర్వం కోల్పోయిన ప్రజలు చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తామున్నామంటూ అండగా నిలబడే సినీ పరిశ్రమ కనీసం పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది’ అని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పలు జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతుంటే టాలీవుడ్ హీరోలు స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.