టీఎంసీ ఉపాధ్యక్షుడిగా యశ్వంత్ సిన్హా
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు ఆ పార్టీ సమున్నత గౌరవం కల్పించింది. సిన్హాను టీఎంసీ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఒక లేఖను విడుదల చేసింది. వైస్ ప్రెసిడెంట్‌తో పాటు ఆయనను పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా కూడా నియమిస్తూ టీఎంసీ జనరల్ సెక్రెటరీ సుబ్రతా భక్షి ఉత్తర్వులు జారీ చేశారు. దివంగత ప్రధానమంత్రి వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా.. ప్రధాని మోడీ నేతృత్వంలోని […]
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు ఆ పార్టీ సమున్నత గౌరవం కల్పించింది. సిన్హాను టీఎంసీ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఒక లేఖను విడుదల చేసింది. వైస్ ప్రెసిడెంట్‌తో పాటు ఆయనను పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా కూడా నియమిస్తూ టీఎంసీ జనరల్ సెక్రెటరీ సుబ్రతా భక్షి ఉత్తర్వులు జారీ చేశారు. దివంగత ప్రధానమంత్రి వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా.. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుతో విభేదించారు. 2018లో ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చి పలు అంశాలపై కేంద్రప్రభుత్వంపై విమర్శలను తీవ్రతరం చేశారు. కాగా.. మార్చి 13న ఆయన టీఎంసీలో చేరిన విషయం విదితమే.