యాసంగి అదుర్స్.. గణనీయంగా పెరిగిన సాగు

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులకు యాసంగి కలిసొచ్చింది. యాసంగిలో పంటల సాగు గణనీయంగా పెరిగింది. 59 లక్షల ఎకరాలు దాటి పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు పెరగడం, చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీరుండటంతో సాగుకు అనుకూలంగా మారింది. మొత్తం పంటల సాగు 59.75 లక్షల ఎకరాలు దాటినట్లుగా వ్యవసాయ శాఖ నివేదిక విడుదల చేసింది. యాసంగిలో వరి సాగు భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే నాలుగింతల సాగు ఎక్కువైంది. సాధారణ సాగు 22.19 లక్షల […]

Update: 2021-02-11 12:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులకు యాసంగి కలిసొచ్చింది. యాసంగిలో పంటల సాగు గణనీయంగా పెరిగింది. 59 లక్షల ఎకరాలు దాటి పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు పెరగడం, చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీరుండటంతో సాగుకు అనుకూలంగా మారింది. మొత్తం పంటల సాగు 59.75 లక్షల ఎకరాలు దాటినట్లుగా వ్యవసాయ శాఖ నివేదిక విడుదల చేసింది. యాసంగిలో వరి సాగు భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే నాలుగింతల సాగు ఎక్కువైంది. సాధారణ సాగు 22.19 లక్షల ఎకరాలు ఉండగా గత యాసంగిలో 16.77 లక్షలు వేశారు. కానీ ఈసారి ఏకంగా 46.24 లక్షల ఎకరాలు దాటింది. అటు మొక్కజొన్న కూడా అంతే. వానాకాలంలో కొంత వరకే పరిమితమైనా… యాసంగిలో మాత్రం 3.73 లక్షల ఎకరాల్లో వేశారు. ఉల్లిసాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినా సాగు స్వల్పంగానే పెరిగింది. యాసంగిలో ఉల్లి సాధారణ సాగు 21,869 ఎకరాలు ఉండగా గతేడాది 9 వేల ఎకరాల్లో వేశారు. ఈసారి మాత్రం 10,127 ఎకరాలకు చేరింది. శనగ కూడా పెరిగింది. సాధారణ సాగు 2.48 లక్షల ఎకరాలే ఉండగా.. ఇప్పుడు 3.22 లక్షల ఎకరాలు దాటింది.

యాసంగి సాగు ఇలా.. (ఎకరాల్లో)

పంట సాధారణం గతేడాది ప్రస్తుతం
వరి 22,19,326 16,77,442 46,24,289
జొన్న 67,324 37,366 1,07,489
మొక్కజొన్న 4,04,860 4,04,656 3,73,887
శనగ 2,48,622 3,66,672 3,22,207
మినుములు 18,454 17,608 40,545
పల్లి 3,05,685 2,87,078 2,34,539
కంది 1764 460 4,333
ఉల్లిగడ్డ 21,869 9765 10,127
——————————————————————————-
మొత్తం 36,93,016 39,00,659 59,75,642

——————————————————————————–

Tags:    

Similar News