‘యాస్’ తుఫాన్ ఎఫెక్ట్.. కకావికలమైన బాలాసోర్
దిశ, వెబ్‌డెస్క్ : బంగాళఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ ఎట్టకేలకు ఒడిశా కేంద్రంగా బుధవారం సాయంత్రం తీరం దాటింది. తుఫాన్ తీరం దాటే సమయంలో పెనుగాలులతో పాటు భీకర వర్షం కురిసింది. తీరంలో అలలు అల్లకల్లోలం సృష్టించాయి. అంతేకాకుండా సముద్రం కొంత మేర ముందుకు వచ్చినట్లు సమాచారం. తుఫాన్ బీభత్సానికి ఒడిశాలోని పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని జనాలను అధికారులు ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో […]
దిశ, వెబ్‌డెస్క్ : బంగాళఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ ఎట్టకేలకు ఒడిశా కేంద్రంగా బుధవారం సాయంత్రం తీరం దాటింది. తుఫాన్ తీరం దాటే సమయంలో పెనుగాలులతో పాటు భీకర వర్షం కురిసింది. తీరంలో అలలు అల్లకల్లోలం సృష్టించాయి. అంతేకాకుండా సముద్రం కొంత మేర ముందుకు వచ్చినట్లు సమాచారం. తుఫాన్ బీభత్సానికి ఒడిశాలోని పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.
ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని జనాలను అధికారులు ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెద్దగా ప్రాణనష్టం వాటిల్లలేదు.కానీ, చాలా మంది గూడు చెదిరిపోయి నిరాశ్రయులయ్యారు. బాలాసోర్ జిల్లా తుఫాన్ విలయం వలన భారీగా ఎఫెక్ట్ అయ్యింది. 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచడంతో చెట్లు విరిగిపోగా, అనేక గ్రామాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల వాహనాలు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఒడిశాతో పాటు బెంగాల్లోనూ యాస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈరోజు పున్నమి కావడంతో యాస్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే చాన్స్ ఉందని వాతావరణ శాఖ ముందే ప్రకటించగా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.