యాక్టర్‌కు ఇవన్నీ కామన్.. భరించాల్సిందే!

‘నువ్విలా, కొరియర్‌బాయ్ కళ్యాణ్, గౌరవం’ వంటి సినిమాలతో తెలుగు వారిని అలరించిన హిందీ నటి యామీ గౌతమ్ గుర్తుండే ఉంటుంది. తొలినాళ్లలో హిందీ టీవీ సీరియల్స్‌లో నటించిన యామీ.. 2010లో కన్నడ చిత్రం ‘ఉల్లాస ఉత్సాహ’లో తొలిసారి వెండితెరపై మెరిసింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ చిత్రాలు కూడా చేసిన యామీకి దక్షిణాదిలో పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఆ క్రమంలోనే 2012లో హిందీ చిత్రం ‘విక్కీ డోనర్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ […]

Update: 2020-08-23 06:10 GMT

‘నువ్విలా, కొరియర్‌బాయ్ కళ్యాణ్, గౌరవం’ వంటి సినిమాలతో తెలుగు వారిని అలరించిన హిందీ నటి యామీ గౌతమ్ గుర్తుండే ఉంటుంది. తొలినాళ్లలో హిందీ టీవీ సీరియల్స్‌లో నటించిన యామీ.. 2010లో కన్నడ చిత్రం ‘ఉల్లాస ఉత్సాహ’లో తొలిసారి వెండితెరపై మెరిసింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ చిత్రాలు కూడా చేసిన యామీకి దక్షిణాదిలో పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఆ క్రమంలోనే 2012లో హిందీ చిత్రం ‘విక్కీ డోనర్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ సాధించడంతో పాటు యామీ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో బాలీవుడ్‌లో కెరీర్ లీడ్ చేస్తోంది అమ్మడు. అయితే, లాక్‌డౌన్ వేళ.. జీవితంలో కొన్ని మార్పులొచ్చాయని, తన జీవితంలో యోగా, వ్యాయామాన్ని భాగం చేసుకున్నానని చెబుతోంది యామీ.

ఇన్‌స్టా వేదికగా తన లైఫ్‌లోని కొన్ని ముఖ్యమైన విషయాలను అభిమానులతో పంచుకున్న యామీ.. ‘ఈ పోస్ట్ చాలా పర్సనల్. నెక్ ఇంజ్యూరీతో చాలా బాధపడ్డాను. డ్యాన్స్, వర్కవుట్స్, తీరిక లేని ప్రయాణాలు, ఫిజికల్ యాక్టివిటీ, యాక్షన్, పెయిన్‌ఫుల్ ఫుట్‌వేర్.. ఇలా ఈ లిస్టు‌కు అంతం ఉండదు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల.. నాకు నెక్ పెయిన్ వచ్చింది. యాక్టర్‌కు ఇవన్నీ కామన్.. తప్పక భరించాల్సిందే’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకుముందు చాలాసార్లు యోగా చేయాలనుకున్నా.. పెయిన్ వల్ల మధ్యలోనే వదిలేశానని, కానీ ఈసారి ఎంత పెయిన్‌గా ఉన్నా భరించాలని నాకు నేనుగా చెప్పుకున్నానని తెలిపింది. నేను ఈ విషయంలో ఎక్స్‌పర్ట్‌ను కాదు గానీ, ప్రయత్నిస్తున్నానంది. నా యోగా పోజ్ చూస్తే.. నేను ఎక్స్‌పర్ట్ కాననే విషయం మీకే అర్థమవుతుందంటూనే.. ‘చిన్న అడుగులతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను.. ఇది ఎప్పటికీ ఆపను’ అని యామీ ఉద్వేగంగా పోస్ట్ చేసింది.

https://www.instagram.com/p/CEOK5oAl8K6/

Tags:    

Similar News