కొత్త ఆర్15 వేరియంట్.. విడుదల చేసిన యమహా మోటార్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా బుధవారం తన కొత్త ఆర్15 వీ3.0 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.1.57 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించామని కంపెనీ వెల్లడించింది. యూనీబాడీ పేరుతో సింగిల్ సీట్‌తో వస్తుందని, దేశవ్యాప్తంగా యమహా డీలర్‌షిప్ అన్నిచోట్ల అందుబాటులో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. 155సీసీ ఇంజిన్‌తో వచ్చిన ఈ బైక్ రేసింగ్ బ్లూ కలర్‌లో లభిస్తుంది. అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులకు ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా బుధవారం తన కొత్త ఆర్15 వీ3.0 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.1.57 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించామని కంపెనీ వెల్లడించింది. యూనీబాడీ పేరుతో సింగిల్ సీట్‌తో వస్తుందని, దేశవ్యాప్తంగా యమహా డీలర్‌షిప్ అన్నిచోట్ల అందుబాటులో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. 155సీసీ ఇంజిన్‌తో వచ్చిన ఈ బైక్ రేసింగ్ బ్లూ కలర్‌లో లభిస్తుంది.
అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులకు ఈ బైకును అందించనున్నామని, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ఇంజిన్ కట్-ఆఫ్ ఉన్న సైడ్-స్టాండ్, సూపర్ వైడ్ రేడియల్, మల్టీ ఫంక్షన్ ఎల్‌సీడీ క్లస్టర్ లాంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ‘సూపర్ స్పోర్ట్ విభాగంలో ఇప్పటికే ఆర్15 దేశీయ వినియోగదారుల నుంచి మంచి స్పందను సాధించింది. రేసింగ్ అనుభూతిలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చామని’ యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఛైర్మన్ మోటోఫుమి షితారా అన్నారు