ఈనెల 8న యాదాద్రిశుడి దర్శన భాగ్యం?
దిశ, నల్లగొండ: లాక్డౌన్ నిబంధనల సడలింపుతో జూన్8 నుంచి రాష్ట్రంలో పలు ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి క్షేత్రం తెరిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే దేవాదాయశాఖ మార్గదర్శకాల కోసం అధికారులు వేచి చూస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆలయాలు 71 రోజులుగా మూసి ఉన్న సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో ఆలయాలు తెరవనున్నడంతో కేవలం దర్శనాలకే పరిమితం చేయాలా లేక ఇతర సేవలు కూడా అందించాలా? ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు […]
దిశ, నల్లగొండ: లాక్డౌన్ నిబంధనల సడలింపుతో జూన్8 నుంచి రాష్ట్రంలో పలు ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి క్షేత్రం తెరిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే దేవాదాయశాఖ మార్గదర్శకాల కోసం అధికారులు వేచి చూస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆలయాలు 71 రోజులుగా మూసి ఉన్న సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో ఆలయాలు తెరవనున్నడంతో కేవలం దర్శనాలకే పరిమితం చేయాలా లేక ఇతర సేవలు కూడా అందించాలా? ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై ఆరోగ్యశాఖతో ఆలయ అధికారులు చర్చిస్తున్నారు. ప్రసాద విక్రయాలపై ఆలయాల ఈవోల అభిప్రాయాలను సేకరించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం చర్యలు తీసుకుంటోంది.