రైతులంతా ఒకేసారి ధాన్యం తేవొద్దు: కలెక్టర్ అనిత
దిశ, నల్లగొండ: రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు ఒకేసారి తరలించొద్దని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. ఆదివారం పల్లెర్ల, ముత్తిరెడ్డిగూడెం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులందరూ కొనుగోలు కేంద్రాల్లో సామాజిక దూరం పాటించాలన్నారు. కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రైతులు ఒకేసారి పెద్ద ఎత్తున ధాన్యం తీసుకురావొద్దని సూచించారు. కలెక్టర్ వెంట డీసీఓ వెంకట్ రెడ్డి, తహసీల్దార్ జ్యోతి, ఏఓ శిల్ప, […]
దిశ, నల్లగొండ: రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు ఒకేసారి తరలించొద్దని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. ఆదివారం పల్లెర్ల, ముత్తిరెడ్డిగూడెం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులందరూ కొనుగోలు కేంద్రాల్లో సామాజిక దూరం పాటించాలన్నారు. కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రైతులు ఒకేసారి పెద్ద ఎత్తున ధాన్యం తీసుకురావొద్దని సూచించారు. కలెక్టర్ వెంట డీసీఓ వెంకట్ రెడ్డి, తహసీల్దార్ జ్యోతి, ఏఓ శిల్ప, పీఏసీఎస్ ఛైర్మన్ శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Tags: Yadadri collector,Anitha Ramachandran,Inspect