ఇక గాలితో.. మొబైల్ చార్జింగ్
దిశ, వెబ్‌డెస్క్ : ఎలక్ట్రానిక్స్, వేరబుల్ ప్రొడక్ట్స్ తయారీ సంస్థ షియోమీ సరికొత్త ‘చార్జింగ్’ విధానానికి తెరతీసింది. దాంతో ఇకపై మొబైల్ ఫోన్ చార్జ్ చేయాలంటే చార్జర్ కోసం వెతుక్కోనక్కర్లేదు. గాల్లోనే మొబైల్ బ్యాటరీ రీచార్జ్ కానుంది. పాండమిక్ తర్వాత ఎన్నో కంపెనీలు కాంటాక్ట్‌లెస్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా, షియోమీ ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్‌లెస్ చార్జర్‌తో మార్కెట్‌లోకి రాబోతుంది. ఒకప్పుడు మొబైల్ చార్జింగ్ చేయాలంటే రెండు మూడు గంటలు పట్టేది. చార్జర్ కూడా చాలా బరువుగా, […]
దిశ, వెబ్‌డెస్క్ : ఎలక్ట్రానిక్స్, వేరబుల్ ప్రొడక్ట్స్ తయారీ సంస్థ షియోమీ సరికొత్త ‘చార్జింగ్’ విధానానికి తెరతీసింది. దాంతో ఇకపై మొబైల్ ఫోన్ చార్జ్ చేయాలంటే చార్జర్ కోసం వెతుక్కోనక్కర్లేదు. గాల్లోనే మొబైల్ బ్యాటరీ రీచార్జ్ కానుంది. పాండమిక్ తర్వాత ఎన్నో కంపెనీలు కాంటాక్ట్‌లెస్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా, షియోమీ ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్‌లెస్ చార్జర్‌తో మార్కెట్‌లోకి రాబోతుంది.
ఒకప్పుడు మొబైల్ చార్జింగ్ చేయాలంటే రెండు మూడు గంటలు పట్టేది. చార్జర్ కూడా చాలా బరువుగా, పెద్దవిగా ఉండేవి. ఆ తర్వాత చిన్నవిగా రావడంతో పాటు, ఫాస్ట్ చార్జర్స్ అందుబాటులోకి వచ్చాయి. వైర్‌లెస్ చార్జింగ్ స్టాండ్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. ప్రస్తుతం వైర్‌లెస్ చార్జింగ్ డివైజ్‌లకు చెక్ పెడుతూ, ఎయిర్ చార్జింగ్ టెక్నాలజీతో రిమోట్ చార్జర్‌ను షియోమీ తీసుకొచ్చింది. ‘ఎంఐ ఎయిర్ చార్జ్’ పేరుతో వస్తున్న ఈ డివైజ్ ఉపయోగించి ఫోన్లు, టాబ్లెట్స్, ఇతర చార్జింగ్ డివైజ్‌లను నాలుగు సెంటిమీటర్ల దూరం నుంచి చార్జ్ చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే వైఫైలా పనిచేస్తుందని చెప్పొచ్చు. దీనికి ఎలాంటి కేబుల్, స్టాండ్ అవసరం ఉండకపోగా, ఒకేసారి పలు డివైజ్‌లను చార్జ్ చేసుకునే అవకాశముంది. ఆఫీసులు, షాపింగ్ మాల్స్, థియేటర్స్‌తో పాటు, ఇంట్లోనూ వీటిని ఉపయోగించవచ్చు. షియోమి సంస్థ ఈ లేటెస్ట్ టెక్నాలజీని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అభివృద్ది చేయగా, ఈ డివైజ్‌లోని డిస్ ప్లే బ్యాటరీ లెవల్, చార్జింగ్ స్టేటస్‌ను చూపిస్తోంది. అయితే షియోమీ..దీన్ని ఎప్పుడు మార్కెట్‌లో విడుదల చేస్తున్నదన్న విషయాన్ని వెల్లడించలేదు.