డబ్ల్యూటీసీ ఫైనల్స్ బెస్టాఫ్ త్రీ ఉండాల్సింది : రవిశాస్త్రి
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్‌ను బెస్టాఫ్ త్రీ మ్యాచ్‌లుగా నిర్వహిస్తే బాగుండేదని టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లడానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలసి కోచ్ రవిశాస్త్రి మీడియాతో మాట్లాడారు. ‘వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడం అంటే ఒకటి రెండు రోజుల్లోనే వారాల్లోనే తేలిన విషయం కాదు. రెండేళ్ల పాటు ప్రపంచమంతా తిరిగి అనేక జట్లతో తలపడి ఫైనల్ బెర్తును […]
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్‌ను బెస్టాఫ్ త్రీ మ్యాచ్‌లుగా నిర్వహిస్తే బాగుండేదని టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లడానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలసి కోచ్ రవిశాస్త్రి మీడియాతో మాట్లాడారు. ‘వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడం అంటే ఒకటి రెండు రోజుల్లోనే వారాల్లోనే తేలిన విషయం కాదు. రెండేళ్ల పాటు ప్రపంచమంతా తిరిగి అనేక జట్లతో తలపడి ఫైనల్ బెర్తును సాధించారు. ఇందుకు గాను టీమ్ ఇండియా ఆటగాళ్లు ఎంతగానో శ్రమించారు. అలాంటిది ఫైనల్‌లో ఒక మ్యాచ్ ద్వారా విజేతను నిర్ణయించడం సరికాదు.
ఇప్పటికైతే ఇలాగ కానివ్వండి కానీ భవిష్యత్‌లో మాత్రం బెస్టాఫ్ త్రీ ఫార్మాట్‌లో నిర్వహిస్తే ఏ జట్టు కూడా నష్టపోకుండా ఉంటుంది’ అని శాస్త్రి చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ అంటే వరల్డ్ కప్‌తో సమానమని రవిశాస్త్రి అన్నాడు. శ్రీలంకకు ఇండియా బి టీమ్‌ను పంపడంపై స్పందిస్తూ.. ఒకే సమయంలో రెండు జట్లను ఆడించడం ద్వారా భారత జట్టుకే మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. టీ20 క్రికెట్‌ను మరింతగా విస్తరించాలంటే ప్రతీ దేశానికి బి టీమ్స్ ఉండటం మంచిదేఅని అన్నారు. క్రికెట్‌ను ఎక్కువ దేశాలు ఆడితే ఒలింపిక్స్‌లో కూడా చోటు దక్కుతుందని శాస్త్రి అభిప్రాయపడ్డాడు.
ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. భారత జట్టు ఈ రోజు ఫైనల్‌కు చేరుకుందంటే ఒక్క రోజులో అంతా జరిగిపోలేదు.. గత నాలుగైదేళ్లగా టెస్ట్ క్రికెట్ ఆడుతున్న ప్రతీ క్రికెటర్ పడ్డ కష్టం వల్లే ఇండియా ఫైనల్ చేరగలిగిందని విరాట్ కోహ్లీ అన్నాడు. నాపై డబ్ల్యూటీసీ ఫైనల్ ఒత్తిడి ఏమీ లేదని.. అన్ని మ్యాచ్‌లలో నడిపించినట్లే ఇందులోనూ జట్టును నడిపిస్తానని కోహ్లీ అన్నాడు. ఇంగ్లాండ్‌లో పరిస్థితులు న్యూజీలాండ్‌కు అనుకూలిస్తాయని అనడాన్ని తాను ఖండిస్తున్నానని అన్నాడు. అలా అనుకుంటే ఆస్ట్రేలియాలో ఆ దేశానికే పరిస్థితులు అనుకూలించాలి. కానీ టీమ్ ఇండియా గెలిచిందని గుర్తు చేశాడు. ఇంగ్లాండ్ పరిస్థితులు న్యూజీలాండ్, ఇండియాకు ఒకే విధంగా ఉంటాయని కోహ్లీ అన్నాడు.