చిక్కినట్టే చిక్కి చేజారిన ‘పసిడి’.. రెజ్లింగ్‌లో భారత్‌కు మరో రజతం
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ పసిడి ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. చిక్కినట్టే చిక్కి బంగారు పతకం చేజారిపోయింది. రెజ్లింగ్ 57 కేజీల పురుషుల విభాగంలో రవికుమార్ దహియా ఫైనల్లో నిరాశపరిచాడు. తొలుత మ్యాచ్ ప్రారంభంలో రవికుమార్ ఆధిక్యం కనబరచగా పసిడి ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ, రష్యా రెజ్లర్ తిరిగి పుంజుకోవడంతో 4-7 తేడాతో రవికుమార్ దహియా ఓటమి పాలవ్వడం అందరినీ నిరాశకు గురిచేసింది. బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన రవికుమార్ […]
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ పసిడి ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. చిక్కినట్టే చిక్కి బంగారు పతకం చేజారిపోయింది. రెజ్లింగ్ 57 కేజీల పురుషుల విభాగంలో రవికుమార్ దహియా ఫైనల్లో నిరాశపరిచాడు. తొలుత మ్యాచ్ ప్రారంభంలో రవికుమార్ ఆధిక్యం కనబరచగా పసిడి ఖాయం అని అంతా అనుకున్నారు.
కానీ, రష్యా రెజ్లర్ తిరిగి పుంజుకోవడంతో 4-7 తేడాతో రవికుమార్ దహియా ఓటమి పాలవ్వడం అందరినీ నిరాశకు గురిచేసింది. బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన రవికుమార్ చివరకు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో భారత్ ఖాతాలో మరో సిల్వర్ వచ్చి చేరింది. కాగా, తొలి సిల్వర్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రాగా, రెండోవది రెజ్లింగ్‌లో రావడం విశేషం.